ఆంధ్రప్రదేశ్‌

డిసిఐకి కోల్‌కతా పోర్టు డ్రెడ్జింగ్ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 8: కోల్‌కతా పోర్టు పూడికతీత పనులను విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డిసిఐ) దక్కించుకుంది. చానల్స్ నిర్వహణ నిమిత్తం రూ.1119 కోట్ల విలువైన పనులను గ్లోబల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా డిసిఐ దక్కించుకోవడం విశేషం. గత మూడు దశాబ్ధాలుగా ఈ పనులను డిసిఐ నామినేషన్ విధానంలో చేపడుతోంది. అయితే కేంద్రం సవరించిన నిబంధనల మేరకు డ్రెడ్జింగ్ పనులకు కోల్‌కతా పోర్టు గ్లోబల్ టెండర్లను పిలిచింది. కోల్‌కతా పోర్టులోని హల్దియా డాక్ కాంప్లెక్స్ చానల్స్ పనులను ఐదేళ్ల పాటు చేపట్టేందుకు గాను టెండర్లను పిలిచారు. 2017 నుంచి ఐదు సంవత్సరాల పాటు డిసిఐ కోల్‌కతా పోర్టు డ్రెడ్జింగ్ పనులను చేపడుతుంది. దేశ, విదేశాలకు చెందిన ఏడు సంస్థలు పోటీ పడగా డిసిఐ రూ.1119 కోట్లతో అతితక్కువ మొత్తానికి బిడ్డింగ్ దాఖలు ఖరాలుచేశారు.