ఆంధ్రప్రదేశ్‌

వరద నష్టం అంచనాకు 11న కేంద్ర బృందం రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ నెల 11వ తేదీ నుంచి మూడు రోజులపాటు కేంద్ర బృందం ఎపిలో పర్యటించనుంది. 11, 12 తేదీల్లో గుంటూరు జిల్లా, 13న విశాఖపట్నంలో బృందం పర్యటించనుంది. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు రూ.1065.08 కోట్లు నష్టం వాటిల్లిందని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారీ వర్షాలు కురవడంతో ఎపిలోని గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నంలో తీవ్ర నష్టం జరిగింది. పంటలు దెబ్బతిన్నాయి. రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భారీ వర్షాలు, వరదలకు 19 మంది చనిపోయారు. భారీ వర్షాలు, వరదల ప్రభావం రాష్ట్రంలోని పది జిల్లాలపై పడింది. ప్రధానంగా గుంటూరు, విశాఖపట్టణం జిల్లాల్లో పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం రియల్ టైమ్‌లో సేకరించిన వివరాలను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది.