ఆంధ్రప్రదేశ్‌

తూ.గో.లో ఐదు ఫ్లైఓవర్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 8: చారిత్రక నగరం రాజమహేంద్రవరం రూపురేఖలు మరికొద్ది కాలంలో మారిపోనుంది. తూర్పు గోదావరి జిల్లాలో చెన్నై-కోల్‌కతా 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఐదు ఫ్లైఓవర్ల నిర్మాణానికి కేంద్రం అనుమతించింది. అందులో రాజమహేంద్రవరం వద్ద నాలుగు నిర్మించనున్నారు. ఆరు లేన్ల వెడల్పున ఈ వంతెనలు జాతీయ రహదారులకు అనుసంధానంగా నిర్మించనున్నారు. మొత్తం సుమారు రూ.500 కోట్ల వ్యయంతో ఈ ఫ్లై ఓవర్ వంతెనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రాజెక్టు డిటైల్డ్ రిపోర్టులు కూడా సమర్పించారు. టెండర్ల ప్రక్రియ డిసెంబర్‌లో పూర్తిచేసుకుని అదే నెల చివరి వారంలో పనులకు శ్రీకారం చుట్టేవిధంగా శాఖాపరంగా పనులు చకచకా చేపట్టారు. రాజమహేంద్రవరం నగరంలోని మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా కార్పొరేషన్‌లో విలీనమయ్యే గ్రామాల పరిధిని దృష్టిలో పెట్టుకుని నగరంలోని ఎవిఎ రోడ్డు, జెఎన్ రోడ్లను వంద అడుగుల రోడ్లుగా విస్తరించి వంతెనలకు సర్వీసు రోడ్లు, సబ్ వేలు ఏర్పాటు చేసేవిధంగా రూపకల్పన చేశారు. దివాన్ చెరువు జంక్షన్ వద్ద ఒక ఫ్లై ఓవర్ నిర్మాణం జరగనుంది. ఇక్కడ నుంచి బ్రిడ్జి గోదావరి నదిపై గామన్ వంతెనకు కలుస్తుంది. మొత్తం ఈ వంతెన పొడవు 1.5 కిలో మీటర్లు. సెంటర్ డివైడర్ నిర్మాణం, సోలార్ లైటింగ్, అప్రోచ్ రోడ్లు నిర్మిస్తారు. అలాగే లాలాచెరువు వద్ద ఆర్చి బ్రిడ్జిని నిర్మించనున్నారు. మోరంపూడి జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్‌ను కూడా 750 మీటర్ల పొడవున నిర్మించనున్నారు. వేమగిరి జంక్షన్ వద్ద 750 మీటర్ల పొసెంటర్ డివైడర్‌ను, అప్రోచ్ రోడ్లను, సోలార్ లైట్లతో చైనా సాంకేతిక టెక్నాలజీతో అత్యాధునిక వంతెనలు నిర్మించనున్నారు. జొన్నాడ జంక్షన్ వద్ద కూడా 750 మీటర్ల వెడల్పున ఆరు లేన్ల రోడ్డుతో ఫ్లై ఓవర్ ఇటు కాకినాడకు, అటు విజయవాడకు, ఇటు రాజమహేంద్రవరానికి అనుసంధానం చేస్తూ నిర్మించనున్నారు. దీని వల్ల కాకినాడ పోర్టు, పశ్చిమ గోదావరి, కోనసీమ ప్రాంతానికి కూడా మార్గం సుగమం అవుతుందని రూపొందించారు. ప్రతీ ఫ్లై ఓవర్‌లోనూ సైకిళ్ళకు ప్రత్యేక పాత్‌ను రూపకల్పన చేశారు. వేమగిరి, బొమ్మూరు వద్ద సబ్‌వే నిర్మించనున్నారు.