ఆంధ్రప్రదేశ్‌

‘గుడా’ ఏర్పాటుకు రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 8: గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (గుడా) ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వం ఇందుకు సంబంధించి జిఓ నెంబర్ 276ను విడుదల చేసింది. గతంలో కాకినాడ, రాజమహేంద్రవరం కార్పొరేషన్లను విడివిడిగా అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఇపుడు రెండు కార్పొరేషన్లు, పరిసర ఇరవై మండలాలను విలీనం చేస్తూ గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ ఏర్పాటు చేయనున్నారు. రెండు విడివిడిగా వుంటే మరింత అభివృద్ధితో పాటు రెండు పదవులు వచ్చి రాజకీయ పదవుల పునరావాసం ఏర్పడేదని, ఇపుడు ఒకే ఛైర్మన్ పదవితో సరిపెట్టుకోవాల్సి వస్తోందని ఆశావహులు అంటున్నారు.