ఆంధ్రప్రదేశ్‌

ఊపిరాడని ‘సింగిల్ విండో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 8 : ఓ వైపు ముఖ్యమంత్రి పరిశ్రమల కోసం పారిశ్రామికవేత్తలతో భేటీలు వేస్తున్నారు. ‘సింగిల్ విండో’ పెట్టాం... వచ్చేయండని దండోరా వేస్తున్నారు. అర్జీ పెట్టిన వెంటనే అన్ని అనుమతులు వచ్చేస్తాయని భరోసా ఇస్తున్నారు. కానీ అధికారుల్లో ఆ స్పీడ్ కనిపించకపోగా, నత్తలతో పోటీ పడుతున్నారు. ఎన్‌ఆర్‌ఐలు మాతృభూమిపై మమకారంతో పరిశ్రమలు పెట్టేందుకు ఉత్సాహంతో వస్తుంటే, అధికారులు తమ నిర్లక్ష్య ధోరణితో దానిని సమాధి చేస్తున్నారు. ఫలితంగా బాబు కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతోంది. ఇవీ నవ్యాంధ్రలో ఎన్నారైల పరి‘శ్రమ’ కష్టాలు! అమరావతి రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన వారి ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకునేందుకు ఎపిఐఐసి అధికారులు చాలా సమయం తీసుకుంటూ సహనాన్ని పరీక్షిస్తున్నారు. కృష్ణా జిల్లా తోటపల్లి కొండపై మూడు దశల్లో సోలార్ ప్రాజెక్టును చేపట్టేందుకు వచ్చిన ఒక ఎన్నారై, అధికారుల వైఖరితో విసిగిపోయి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఈషాన్ ఎనర్జీ అనే సంస్థ దేశంలోనే ఈ తరహా ప్రాజెక్టును తొలిసారిగా రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. రెవెన్యూ శాఖకు చెందిన 600 ఎకరాల్లో 460 ఎకరాలను మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటుకు ఎపిఐఐసి కేటాయించింది. సముద్ర మట్టానికి 463 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ స్థలం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అనువు కాదని, నీరు, రవాణా సౌకర్యం సమస్యగా మారుతుందన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియచేయలేదు. మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటుకు కొంత గ్రాంట్‌ను కూడా రాష్ట్ర పరిశ్రమల శాఖకు విడుదల చేసింది.
తరువాత దీనిని గన్నవరం మండలం వీరవల్లికి తరలించారు. ఈ నేపథ్యంలో ఈషాన్ ఎనర్జీ సిఇఒ ఫణిచంద్ర ఈ ప్రాంతాన్ని పరిశీలించి, ఒక ప్రతిపాదనను ఎన్‌ఆర్‌ఇడిసిఎపి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. ఈ మేరకు సాధ్యాసాధ్యాల నివేదికను ఎన్‌ఆర్‌డిడిసిఎపి కృష్ణా జిల్లా శాఖ ఎండికి పంపింది. అమెరికాలో నివసించే ఎన్నారైలు కలిసి ఏర్పాటు చేసిన ఈషాన్ ఎనర్జీ సంస్థ తమ దరఖాస్తును ఈ ఏడాది మేలో అందచేసింది. ఈ ప్రతిపాదనను జూలైలో ఇంధన శాఖకు పంపగా, ఆ శాఖ పరిశ్రమల శాఖకు పంపింది. అక్టోబర్‌లో పరిశ్రమల శాఖ కొన్ని వివరాలు కోరుతూ ఎపిఐఐసికి లేఖ తీరుబడిగా రాసింది.
తమ ప్రతిపాదనకు అనుమతి లభించేందుకు ఆరు నెలల సమయం తీసుకోవడంపై ఆ సంస్థ ప్రతినిధులు నిరుత్సాహానికి గురైయ్యారు. తెలంగాణ, శ్రీలంక, నేపాల్‌ల్లో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్‌ఆర్‌ఇడిసిఎపి ఎండి ఎం.కమలాకర్ బాబు వద్ద ‘ఆంధ్రభూమి’ ప్రస్తావించగా, ఈషాన్ ఎనర్జీ సంస్థకు ఎన్‌ఒసి జారీ నిమిత్తం ఇంధన విభాగం ద్వారా ఎపిఐఐసికి పంపామని, తరువాత రెవెన్యూ శాఖకు వెళ్తుందన్నారు. ఈ అంశంపై ఎపిఐఐసి, రెవెన్యూ శాఖలు క్లియర్ చేస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు.అధికారులు మాత్రం జాప్యానికి కారణంపై మాట్లాడేందుకు నిరాకరించారు.