ఆంధ్రప్రదేశ్‌

కోస్టల్ ఎంప్లాయ్‌మెంట్ జోన్ వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 8: నవ్యాంధ్రలో కోస్టల్ ఎంప్లాయ్‌మెంట్ జోన్ ఏర్పాటు కానుంది. తూర్పు తీరంలో విశాఖ లేదా కృష్ణపట్నంలో ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోస్టల్ ఎంప్లాయ్‌మెంట్ జోన్ వల్ల అభివృద్ధితో పాటు వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. దేశంలోనే ఇది కొత్త ప్రయోగానికి నాంది పలుకనుందన్నారు. చైనా, మలేసియా తదితర దేశాల్లో తీర ప్రాంతాల్లో కోస్టల్ ఎంప్లాయ్‌మెంట్ జోన్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్స్‌గా, వెల్త్‌హబ్స్‌గా, ఎక్స్‌పోర్టు జోన్‌గా అవతరించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రపంచంలో ఇలాంటి ఉత్తమ విధానాలను నీతి ఆయోగ్ పరిశీలించి, వాటిని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు సూచిస్తుందన్నారు. ఇతర దేశాల్లో ఒక్కో రంగానికి ఒక్కో సిటీని అభివృద్ధి చేశారన్నారు. కోస్టల్ ఎంప్లాయ్‌మెంట్ జోన్ వల్ల తక్కువ నిపుణుత కలిగిన వారికి కూడా ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఆ జోన్‌లో తయారయ్యే వాటిని ఎగుమతి చేయవచ్చు లేదా దేశీయంగా విక్రయించుకునే వీలు కలుగుతుందని తెలిపారు. సిఇజెడ్‌ను రాష్ట్రంలో ఏర్పాటుకు ఉన్న సానుకూల అంశాలను నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద పణగారియాకు వివరించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు అభివృద్ధి చేయడానికి కేంద్రం కృషి చేస్తుందన్నారు. విశాఖ- చెన్నై కారిడార్, మచిలీపట్నం, దొనకొండ, శ్రీకాళహస్తి, ఏర్పేడుల్లో పలు పరిశ్రమలు రానున్నాయన్నారు. రాష్ట్రంలోని విశాఖ, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేయనున్నామన్నారు. సింగపూర్ ఎకనామిక్ అథారిటీతో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా విశాఖ ఫిన్‌టెక్ హబ్‌గా మారనుందన్నారు. ఆక్వా వర్సిటీ, ఫైనాన్సియల్ వర్సిటీలు రానున్నాయన్నారు. రాష్ట్రంలో 11 జాతీయ విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం వల్ల మానవ వనరుల సమస్య లేదన్నారు.
సిఎం డాష్‌బోర్డు భేష్
కోస్తా తీరంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా కల్పించే కోస్టల్ ఎంప్లాయ్‌మెంట్ జోన్‌ను తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్‌లో, పశ్చిమ తీరంలో గుజరాత్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించామని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద పణగారియా తెలిపారు. ముందుగా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తామని, ఇందుకు సంబంధించి స్థల పరిశీలన చేస్తామన్నారు. అనంతరం దీనిని వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడతామన్నారు. ఈ జోన్‌ను 400- 500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తామన్నారు. సిఇజెడ్ రాకతో రాష్ట్రం రూపు రేఖలు మారనున్నాయన్నారు.

చిత్రం.. విలేఖరులతో మాట్లాడుతున్న చంద్రబాబు