ఆంధ్రప్రదేశ్‌

ఎఒబిపై పట్టు సాధించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 8: మల్కన్‌గిరి ఆపరేషన్ ద్వారా ఆంధ్ర- ఒడిషా సరిహద్దు ప్రాంతం (ఎఒబి)లో పట్టు సాధించామని డిజిపి నండూరి సాంబశివరావు స్పష్టం చేశారు. గుంటూరులో మోడల్ పోలీసుస్టేషన్ల నిర్మాణాలను మంగళవారం డిజిపి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో వివిఐపి, ప్రజాప్రతినిధులకు భద్రత పెంచామన్నారు. మల్కాన్‌గిరి ప్రాంతంలోనే చాలామంది మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గాలికొండ ఏరియా దళం కదలికలపై నిఘా ముమ్మరం చేశామన్నారు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధమైన మావోయిస్టులకు పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. అదేవిధంగా మావోయిస్టుల వలలో చిక్కుకున్న అమాయక గిరిజనులు స్వేచ్ఛా జీవనం గడిపేందుకు పోలీసుశాఖ సహకరిస్తుందని భరోసా ఇచ్చారు.
గుంటూరులో తన వేధింపులతో సంధ్యారాణి ఆత్మహత్యకు కారకురాలైన ప్రొఫెసర్ లక్ష్మి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారని చెప్పారు. ఏటిఎం కార్డును కూడా ఆమె వినియోగించటంలేదని, దీంతో ఆచూకీ కష్టతరమవుతోందని తెలిపారు. ఆధారాలు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారని, చట్టాన్ని గౌరవించి తక్షణమే లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. లక్ష్మికి సహకరించిన వారిపైనా కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు.

గుంటూరులో మోడల్ పోలీసుస్టేషన్ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న డిజిపి సాంబశివరావు