ఆంధ్రప్రదేశ్‌

చిన్నారులను చిదిమేసిన రెడీమిక్స్ వాహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, నవంబర్ 12: పొట్ట కూటికోసం కూలికొచ్చి కొడుకుల్ని పోగొట్టుకున్న దుర్ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని అచ్ఛంపేట రైల్వేగేటు సమీపాన శనివారం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా, హాలియా గ్రామం నుండి రోడ్డు పక్కన కాలువల నిర్మాణ పనుల నిమిత్తం 20 రోజుల క్రితం వలస వచ్చిన ఏడు కుటుంబాలవారు సత్తెనపల్లిలో ఉంటున్నారు. వారి చిన్నారులను చెట్టునీడలో ఆడుకుంటూ ఉండమని చెప్పి తల్లి దండ్రులు పనుల్లో నిమగ్నమయ్యారు. ఆడుకొని అలసిపోయిన చిన్నారులు చెట్టుకిందే నేలపై నిద్రలోకి జారుకున్నారు.
పనుల వద్దకు చేరుకున్న రెడీ మిక్స్ వాహనాన్ని డ్రైవర్ నిర్లక్షంగా వెనక్కు పోనిచ్చాడు. నేలపై నిద్రిస్తున్న పింగిలి శరత్ (4) సంపంగి చందు (2) చిన్నారులపై రెడీ మిక్స్ వాహనం వెనుక టైర్లు ఎక్కడంతో ఇద్దరు చిన్నారులూ మృత్యువాత పడ్డారు. శరత్ తలపైకి టైరు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందగా, చందు అనే మరో చిన్నారికి తీవ్ర గాయలు కావడంతో అక్కడివారు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చందు మృతిచెందాడు. పింగిలి సుమలత, శ్రీనులకు ఆడపిల్ల, మగపిల్లవాడు. కాగా ఉన్న ఒక మగపిల్లవాడు శరత్ అక్కడే ప్రాణాలు వదలడంతో తల్లి స్పృహ కోల్పోయింది. చందు తల్లి దండ్రులకు ముగ్గురు మగపిల్లలు. చివరివాడు చందు అసుపత్రిలో మృతి చెందాడు.
కూలికోసం వచ్చి కొడుకుల్ని పోగొట్టుకున్న వీరు గుండెలు అవిసేలా విలపిస్తుండడంతో అక్కడివారికి కళ్లు చమర్చాయి. ఈ రోజుతో పనులు పూర్తిఅవుతాయి లెక్కచూసుకొని కూలి తీసుకొని ఈ రోజు రాత్రికే తమ ఊరికి వారు వెళ్లిపోవాల్సిన తరుణంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని సాటి కూలీలు బోరుమని విలపించారు. విషయం తెలుసుకున్న పట్టణ సిఐ సి సాంబశివరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.

సామాన్యులకే ‘పెద్ద’ దెబ్బ
మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్

ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, నవంబర్ 12: ఇంత వరకు ఏ ప్రధాని చేయని తప్పు ప్రధాని మోదీ చేశారని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆరోపించారు. రాజమహేంద్రవరంలో శనివారం విలేఖరుల సమావేశంలో ఉండవల్లి మాట్లాడారు. మోదీ ప్రభుత్వానికి ముందుచూపు లేకుండా పోయిందని, ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని, నగదు రద్దు వల్ల సామాన్య ప్రజలే నానా అవస్థలు పడ్డారని అరుణ్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ చేపట్టిన విధానం సాధారణ ప్రజలపై హిరోషిమా, నాగసాకిపై అణుబాంబు వేసినట్టుగా వుందని, ఎవరికో నష్టం తగులుతుందని ప్రయోగిస్తే నల్ల కుబేరులకు నష్టం తగలకుండా అతి సామాన్యులే సతమతమయ్యే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. మోదీ చేసిన పని ఎనస్తీషియా లేకుండా సర్జరీ చేసినట్టుగా వుందని ఆరోపించారు. రాత్రికి రాత్రే ఈ విధానాన్ని ప్రవేశపెట్టి ఆర్థిక ఎమెర్జెన్సీని సృష్టించారని, ప్రజల ప్రాథమిక హక్కులు హరించారని ఆరోపించారు. రిజర్వుబ్యాంకు జారీ చేసే కరెన్సీ నోటు ప్రామిసరీ నోటులా ఉంటే, అందుపై కేంద్రం ష్యూరిటీ ఇస్తుందని, అసలు నోట్లను రద్దు చేసే అధికారం ప్రధానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. మోదీ ఆలోచన మంచిదే కావొచ్చు గానీ సాధారణ వ్యక్తులు మాత్రం తీవ్రంగా భయపడి కుదేలయ్యే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. చట్ట ప్రకారం టాక్సు తీసుకుని మిగిలిన సొమ్మును తిరిగిచ్చేసే పద్ధతి పెడితే బావుండేదన్నారు. దేశంలో ఒక లక్షా 34వేల 14 వందల బ్యాంకు బ్రాంచీలు ఉండగా అందులో రూ.99 లక్షల 63 వేల కోట్ల డిపాజిట్లు వున్నాయని వివరించారు. ఇందులో రూ.73.63 లక్షల కోట్లు రుణాలుగా రిజర్వు బ్యాంకు నివేదిక ఇచ్చిందన్నారు. దేశంలోని 6లక్షల 38 వేల గ్రామాల్లోనే బ్యాంకు బ్రాంచీలు వున్నాయని, అంటే కేవలం 8 శాతం గ్రామాల్లోనే బ్యాంకు బ్రాంచీలు వున్నాయని, 92 శాతం గ్రామాల్లో బ్యాంకులే లేవన్నారు. 2015-16లో రూ.16లక్షల 40వేల కోట్ల నోట్లు చలామణిలో ఉన్నాయని, ఇందులో రూ.14 లక్షల 20వేల కోట్లు రూ.500, రూ.1000 నోట్లేనని, 86 శాతం వరకు ఈ పెద్ద నోట్లే ఉన్నాయన్నారు. మిగిలిన 14 శాతం మాత్రమే రూ.100, రూ.50 నోట్లు ఉన్నాయన్నారు. ప్రతీ ఏడాది రూ.96వేల కోట్లు విదేశాలకు పోతోందన్నారు. రూ.2 లక్షల 76వేల కోట్లు ఈ ఏడాది వెళ్లిందన్నారు. మొత్తంగా చూసుకుంటే రూ.14.6 బిలియన్ డాలర్సు విదేశాలకు వెళ్లిందన్నారు. ప్రజలను డబ్బుండి పేదవారిగా మార్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. ఎమర్జెన్సీ ఆసుపత్రుల్లో నగదు చెల్లుబాటు కాక, శవాన్ని దహనం చేసేందుకు కూడా డబ్బులేక నానా అవస్థలు పడుతున్న పరిస్థితులు వున్నాయన్నారు. అనుభవ రాహిత్యం, కీర్తి కండూతి వల్లే మోదీ ఈ విధంగా చేశారనిపిస్తోందని ఆరోపించారు. గడువు పెంచి నష్టాన్ని పూడ్చుకునే ఆలోచన చేయాలన్నారు. మోదీ చేసిన పని వల్ల నష్టం ఎవరికి తగలాలో వారికి తగల్లేదని, సామాన్యుడి డబ్బుకు డబ్బు ప్రభుత్వం ఇచ్చి తీరాల్సిందేనని, మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలన్నారు. ఏ రకమైన కక్ష సాధింపు వుండదని, స్వచ్ఛందంగా రావాలని, ఆదాయ పన్ను తీసుకుంటామని ప్రకటిస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చన్నారు. మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఆయన సంకుచిత తత్వాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.