ఆంధ్రప్రదేశ్‌

ఒంటిమిట్ట రామాలయం అభివృద్ధికి కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, మార్చి 29: కడప జిల్లాలో వెలసి మరో అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి పేర్కొన్నారు. కోదండరామయ్య బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒంటిమిట్టలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంగళవారం చదలవాడ పరిశీలించారు. అనంతరం స్వామివారి దర్శనార్థం రాగా అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ ఒంటిమిట్ట టిటిడిలో విలీనమైన తర్వాత మొదటిసారిగా నిర్వహిస్తున్న రామయ్య బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. అలాగే సర్క్యూట్ కేంద్రంగా మారుస్తామన్నారు. పురావస్తు శాఖ నుంచి ఆటంకాలు ఉన్నా వాటిని అధిగమించి ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా చేస్తామన్నారు. ఏప్రిల్ 20వ తేదీ జరిగే సీతారాముల కల్యాణాన్ని రాష్ట్ర ప్రజలంతా తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రతి భక్తునికి స్వామివారి ప్రసాదం, తలంబ్రాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.