ఆంధ్రప్రదేశ్‌

నల్లకుబేరులకు బిజెపి అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, నవంబర్ 13 : పెద్దనోట్లు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐ వెంటనే అవసరం మేరకు కొత్త నోట్లను బ్యాంకులకు చేరవేసి, ప్రజల కష్టాలు తీర్చాలని పిసిసి చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయమై సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా బ్యాంకుల ఎదుట ధర్నాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. మోదీ ప్రభుత్వం అంబానీ, అదానీ, చంద్రబాబు లాంటి వాళ్లను కాపాడేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. రఘువీరా ఆదివారం అనంతపురం నగరంలోని ఎస్‌బిఐ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం, ఆర్‌బిఐ ప్రణాళిక లేకుండా తీసుకున్న నిర్ణయంతో అన్ని వర్గాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే అవసరం మేరకు కొత్తనోట్లను బ్యాంకులకు చేరవేసి ప్రజల కష్టాలను తీర్చాలని డిమాండ్ చేశారు. ఉదయం 10.15గంటలకు బ్యాంకుకు చేరుకున్న రఘవీరా తొలుత బ్యాంక్ ఎదుట పాత రూ. 500, రూ. 1000 నోట్ల మార్పిడి కోసం క్యూలో నిల్చున్న ప్రజలతో మాట్లాడారు. అలాగే బ్యాంక్‌లోకి వెళ్లి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాసులును అడిగి నగదు నిల్వలు, లావాదేవీలపై ఆరా తీశారు. అనంతరం రఘవీరా విలేఖరులతో మాట్లాడుతూ నరేంద్రమోదీ ఎన్నికలకు ముందు రూ. 80 లక్షల కోట్ల నల్లధనాన్ని వందరోజుల్లో ఇండియాకు తెప్పిస్తామని ప్రగల్బాలు పలికి ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు.

చిత్రం..బ్యాంకు ఎదుట బైఠాయించిన రఘువీరా, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు