ఆంధ్రప్రదేశ్‌

ఫిబ్రవరి 10 నుంచి బెజవాడలో మహిళా పార్లమెంటరీ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 15: మహిళా సాధికారత పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ప్రపంచానికి చాటిచెప్పే విధంగా జాతీయ మహిళా పార్లమెంటరీని నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర శాసనసభాపతి, ఎన్‌డబ్ల్యుపి చైర్మన్ కోడెల శివప్రసాద్ అన్నారు. మంగళవారం ఉదయం హోటల్ గేట్‌వేలో సభాపతి అధ్యక్షతన జిల్లాకు చెందిన మంత్రులు, శాసన, శాసనమండలి సభ్యులు, చీఫ్ సెక్రటరీతో పాటు ఉన్నతస్థాయి అధికారులతో ఎన్‌డబ్ల్యుపి నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ 2017 ఫిబ్రవరి, 10, 11, 12వ తేదీలలో పవిత్ర సంగమం వద్ద ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్‌డబ్ల్యుపి సమావేశాలకు సంపూర్ణ సహకారం అందించి విజయవంతం చేయాలని రాష్ట్ర యంత్రాంగంతో పాటు జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా సాధికారికతపై చూపిస్తున్న చిత్తశుద్ధిని ఎన్‌డబ్ల్యుపి అద్దంపట్టే విధంగా ప్రతిఒక్కరూ తమవంతు సహకరించాలని సభాపతి కోరారు. దేశ విదేశాలకు చెందిన ప్రముఖ మహిళా పార్లమెంటేరియన్లతో పాటు సమాజంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనపర్చిన మహిళామణులకు ఈ సమావేశాలకు ఆహ్వానించటానికి సంకల్పించామన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 1400 మంది మహిళా శాసన, శాసనమండలి సభ్యులు, 93 మంది పార్లమెంట్ సభ్యులు, వివిధ రంగాలకు చెందిన 300 మంది మహిళలు ఆహ్వానాలు పంపే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించటం జరిగిందన్నారు. అదే విధంగా దేశంతో పాటు ఇతర దేశాల్లో ఉన్న మహిళా మణులు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అమెరికాకు చెందిన హిల్లరీ క్లింటన్‌లతో పాటు తూర్పు ఆసియా దేశాలకు చెందిన మహిళలు, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి లాంటి వారిని ఆహ్వానించే విధంగా సన్నాహాలు చేస్తున్నట్లు సభాపతి తెలిపారు. మహారాష్ట్ర ఇన్‌స్టిట్యూట్ ఇంజనీరింగ్ (యంఐటి) పూనేకు చెందిన సంస్థ గత 10 సంవత్సరాలుగా మహిళా సాధికారికతకు విశేష కృషి జరుగుతున్నదన్నారు.