ఆంధ్రప్రదేశ్‌

త్వరలో కానిస్టేబుళ్ల రాత పరీక్ష ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 15: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష ఫలితాలను కాకినాడ జెఎన్‌టియుకె మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఈనెల 6వ తేదీన రాష్టవ్య్రాప్తంగా సుమారు 750 పరీక్షా కేంద్రాల్లో కాకినాడ జెఎన్‌టియు ఆధ్వర్యంలో కానిస్టేబుళ్ల నియామకానికి సంబంధించి రాత పరీక్ష నిర్వహించారు. 13 జిల్లాల నుండి సుమారు 3 లక్షల 50వేల మంది అభ్యర్ధులు రాత పరీక్షకు హాజరయ్యారు. ఇటీవలి కాలంలో వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జెఎన్‌టియుకు అప్పగిస్తోంది. తాజాగా కానిస్టేబుల్ అభ్యర్ధుల ఎంపికకు గాను పరీక్ష నిర్వహణ బాధ్యతలను జెఎన్‌టియుకెకు అప్పగించింది. ఈనేపథ్యంలో జెఎన్‌టియుకె రిజిస్ట్రార్ ఆచార్య సిహెచ్ సాయిబాబు ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ రాత పరీక్షలను విజయవంతంగా నిర్వహించామని, ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ప్రతినిధిచే స్వయంగా పంపినట్టు చెప్పారు. పరీక్షకు హాజరైన వారిలో ఎంతమంది ఉత్తీర్ణత సాధించారనే విషయాన్ని త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా విజయవాడలో ప్రకటించనున్నట్టు తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా ఎపి ఎంసెట్, ఎపి పిజిసెట్, ఎన్టీఆర్ కాపు విద్యోన్నతి తదితర వివిధ రకాల ప్రవేశ పరీక్షలను తమ విశ్వ విద్యాలయం నిర్వహిస్తోందన్నారు. తాజాగా కానిస్టేబుల్ ఎంపికకై రాత పరీక్ష నిర్వహించామని, త్వరలో ఫోరెన్సిక్, నిఘా విభాగాలు, ఇన్‌స్పెక్టర్ స్థాయి ప్రవేశ పరీక్షలను సైతం తమ విశ్వ విద్యాలయమే నిర్వహించనున్నట్టు తెలిపారు. కానిస్టేబుల్ రాత పరీక్షలకు పెద్ద ఎత్తున స్పందన లభించిందని, ఏటా నిర్వహించే ఎపి ఎంసెట్‌కు మించి అభ్యర్ధులు హాజరయ్యారన్నారు. విశ్వవిద్యాలయంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో రాత పరీక్షను విజయవంతం చేయగలిగినట్టు పేర్కొన్నారు. ఈ రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్ధులకు శారీరక, వైద్య పరీక్షలను పోలీస్ శాఖ వారే నిర్వహించాల్సి ఉంటుందని డాక్టర్ సాయిబాబు పేర్కొన్నారు.