ఆంధ్రప్రదేశ్‌

11 పట్టణాల్లో రింగ్‌రోడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: గోదావరి నదిలో కలిసే జలాలు కాలుష్యం కాకుండా అనేక చర్యలు తీసుకుంటున్నట్టు పర్యావరణ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నాడు శాసనసభలో వేటుకూరి వెంకట శివరామరాజు, రామాంజనేయులు, ఆకుల సత్యనారాయణ, రామానాయుడు, కాగిత వెంకటరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితర సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. గోదావరి బ్యారేజీ కింద ప్రతి కాల్వ కలుషితం అవుతోందని అన్నారు. అన్ని ప్రాంతాల్లో మురుగును పంట కాల్వల్లో కలిపేస్తున్నారని దాంతో క్యాన్సర్ వంటి తీవ్రమైన జబ్బులు సోకుతున్నాయని సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ ఫాస్పేట్, ఆర్సనిక్, మెర్క్యూరీ, లెడ్ కాల్వల్లో కలిసిపోతోందని అన్నారు. ఉన్నతకులాల్లో ఉన్న పేదవారికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తోందని ఆర్ధిక మంత్రి యనమల సమాధానం చెప్పారు. బిసిలకు ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో ఇబిసిలకు 6 శాతం చొప్పున ప్రవేశాలను సమకూర్చుతామని అన్నారు. రాష్ట్రప్రభుత్వం కాపు సంక్షేమం అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసిందని, అలాగే బ్రాహ్మణ సంక్షేమం, అభివృద్ధి సంస్థను కూడా ఏర్పాటు చేసిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 11 పట్టణాల్లో రింగ్‌రోడ్లు నిర్మించనున్నట్టు పురపాలక మంత్రి నారాయణ చెప్పారు. అయితే ఈ 11 పట్టణాలతో పాటు భవిష్యత్‌లో రింగ్‌రోడ్లు అవసరమైన పట్టణాలను కూడా గుర్తించే కార్యక్రమం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

టెన్త్ పరీక్ష కేంద్రంలో
సిసి కెమెరా మాయం!
జియ్యమ్మవలస, మార్చి 29: ప్రభుత్వ పాఠశాలలోని పదవ తరగతి పరీక్ష కేంద్రంలో ఏర్పాటుచేసిన సిసి కెమెరా మాయమైన సంఘటన విజయనగరం జిల్లాలో మంగళవారం కలకలం రేపింది. జియ్యమ్మవలస మండల పరిధిలో చినమేరంగి జడ్పీ పాఠశాల పదవ తరగతి పరీక్ష కేంద్రంలోని సిసి కెమెరాను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం 9.30 గంటలకు లెక్కల పరీక్ష ప్రారంభం కాగానే సిసి కెమెరాలు ఆన్ చేశారు. అయితే ఆరవ నెంబర్ గదిలో కెమెరా పనిచేయడం లేదని సాఫ్ట్‌వేర్‌లో చూపింది. వెంటనే అధికారులు గదికి వెళ్లి చూడగా అక్కడ సిసి కెమెరా కనిపించలేదు. వెంటనే విషయాన్ని సిబ్బంది పరీక్ష కేంద్రం ముఖ్య నిర్వాహణాధికారి జయరాం దృష్టికి తీసుకువచ్చారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వి.పాపారావు తెలిపారు. నైట్ వాచ్‌ఉమెన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. కాగా జిల్లాలోని 9 సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో ఈసారి సిసి కెమెరాలు ఏర్పాటుచేశారు. అందులో చినమేరంగి కేంద్రం ఒకటి. ఈ కేంద్రంలో నాలుగు కెమెరాలు అమర్చారు. ఒకటి వరండాలో ఏర్పాటుచేయగా, మిగతా మూడు గదుల్లో పెట్టారు. అయితే వీటిలోని ఒక కెమెరా మాయం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.