ఆంధ్రప్రదేశ్‌

కులాల మధ్య చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, నవంబర్ 15: రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు, బీసీ కులాల మధ్య ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చిచ్చు పెడుతున్నారని, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ ఆరోపించారు. ఇడుపులపాయ నుంచి కడప వరకు బలిజ శంఖారావం పేరిట జరుప తలపెట్టిన పాదయాత్రకు విజయవాడ నుంచి ర్యాలీగా బయలుదేరి వెళుతున్న రామానుజయను జాతీయ రహదారిపై గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజటోల్‌గేట్ వద్ద మంగళవారం డిఎస్పీలు జి.రామాంజనేయులు, సీతారామయ్య, సుబ్బారాయుడు తమ సిబ్బందితో అడ్డుకున్నారు. సుమారు 60 కార్లతో ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమైన రామానుజయ కారును అడ్డుకుని ర్యాలీకి అనుమతి లేదని, మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నామని రామానుజయనుద్దేశించి డిఎస్పీ రామాంజనేయులు పేర్కొన్నారు. తానూ గవర్నమెంట్ మనిషినేనని, రైళ్లు తగలబెట్టడానికో, బస్సులు తగల బెట్టడానికో వెళ్లడం లేదని, చట్టాన్ని గౌరవిస్తామని రామానుజయ స్పష్టంచేశారు. తాను కడపలో ఎస్పీ నుంచి అనుమతి తీసుకున్నానని, ఇక్కడ తాను ఎటువంటి సభలు, సమావేశాలు పెట్టడం లేదని, వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని రామానుజయ కోరగా డిఎస్పీలు ససేమిరా అన్నారు. దీంతో ఎస్పీతో మాట్లాడుతానని ఫోన్ చేయగా ఎస్పీ నుంచి కూడా అనుమతి రాలేదు. దీంతో పోలీసులు రామానుజయతోపాటు మరో24 మందిని అరెస్ట్ చేసి, అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. అంతకు ముందు రామానుజయ పార్టీ హైకమాండ్‌తో మాట్లాడి తమ హైకమాండ్ సూచన మేరకు బలిజ శంఖారావం ర్యాలీని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ బలిజ శంఖారావం ఆగదని, అన్ని అనుమతులు తీసుకుని త్వరలోనే నిర్వహిస్తామని అన్నారు.
కాపు కార్పొరేషన్ ద్వారా అనేక సంక్షేమ పథకాలు అమలవుతుండగా జవేమీ జరగనట్టు వైసిపి అధినేత జగన్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఉనికి కొందరు రాజకీయ నాయకులు కాపు ఉద్యమం ప్రారంభిస్తున్నారని, ఇటువంటి వారిని జగన్ అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు పూనుకుంటున్నారని, కాపులను బీసీల్లో చేరిస్తే మీకు నష్టమంటూ బీసీలను రెచ్చ గొడుతున్నారని, మరోవైపు బీసీల్లో కాపులను చేర్చే హామీ చంద్రబాబు విస్మరించారని కాపులను రెచ్చగొడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీసీలకు ఎటువంటి నష్టం లేకుండా తమిళనాడు రాష్ట్రంలో ఉన్న మాదిరిగా కాపులను బీసీల్లో చేర్చేందుకు మంజునాధ కమిషన్‌ను వేయడం జరిగిందని రామానుజయ అన్నారు. ముద్రగడ పద్మనాభంను అడ్డుపెట్టుకుని జగన్ కులాల మధ్య చిచ్చుపెట్టే చర్యలకు పూనుకుంటున్నాడని, ఎన్నో ఏళ్లుగా పులివెందుల, కడప ప్రాంతంలో బలిజల ఓట్లతో గద్దెనెక్కి వైఎస్ రాజశేఖరరెడ్డి వారికి చేసిందేమీ లేదని, ఇప్పుడు జగన్ కూడా అంతేనన్నారు. అందుకే కడప జిల్లాలో వెనుకబడిన బలిజలను చైతన్య పరిచి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలియ జెప్పేందుకు బలిజ శంఖారావం నిర్వహించ తలపెట్టినట్లు రామానుజయ చెప్పారు.

చిత్రం.. ర్యాలీని అడ్డుకున్న డిఎస్పీతో రామానుజయ వాగ్వాదం