ఆంధ్రప్రదేశ్‌

ఊరు ఎంత మారిందో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, నవంబర్ 16: అందరూ కలసికట్టుగా ఐకమత్యంగా ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రముఖ క్రికెటర్ ,రాజ్యసభ సభ్యుడు సచిన్ తెండూల్కర్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన తాను దత్తత తీసుకున్న నెల్లూరు జిల్లా గూడూరు మండల పరిధిలోని పుట్టంరాజువారి కండ్రిగ (పిఆర్ కండ్రిగ)గ్రామాన్ని సందర్శించి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.
సామాజిక వికాస కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాను గతంలో వచ్చిన సమయంలో ఉన్న పుట్టంరాజు కండ్రిక నేడు ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన స్వచ్ఛ్భారత్‌ను ప్రతి ఒక్కరూ అనుసరించి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. విద్యార్థులు చదువు,ఆటలను సమతూకంగా చూసుకోవాలని, చదువుకోవాల్సిన సమయంలో చదువుకుంటూ మిగిలిన సమయంలో ఆటలు ఆడుకోవాలన్నారు. వివాదాలు లేకుండా అరోగ్యంగా, ఆనందంగా కలిసికట్టుగా ఉంటూ మంచి సంబంధాలు కలిగి ఉండాలన్నారు. యువకులు దురలవాట్లకు బానిసలు కాకుండా వుండడంతోపాటు తమ తల్లిదండ్రులకు ఉన్న దురలవాట్లు మానుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్ రాబోయే సంవత్సరం లోపల గ్రామ అభివృద్ధి ప్రణాళికలో ఫేజ్-1ను పూర్తి చేస్తానని చెప్పారన్నారు. గూడూరులో చారిటబుల్ ట్రస్టు ద్వారా ఏర్పాటు చేయనున్న క్రికెట్ స్టేడియం ప్రారంభోత్సవానికి తప్పనిసరిగా వస్తానని హామీ ఇచ్చారు. రెండవ విడతగా పుట్టంరాజు వారి కండ్రిగ పంచాయతీ పరిధిలో ఉన్న నెర్నూరు, గొల్లపల్లి గ్రామాలను దత్తత తీసుకుని రాబోయే సంవత్సరం లోపల వౌలిక వసతులు ఏర్పాటు చేయిస్తానన్నారు.
అనంతరం కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులు మహాపురుషులు అవుతారని అంటారని, సచిన్ తన స్వయంకృషితో మహాపురుషుడు అయ్యారని కొనియాడారు. చిన్న వయస్సులోనే సచిన్ భారతరత్న అవార్డును అందుకున్నారన్నారు. ఆయన క్రికెట్‌లో చూపిన ప్రతిభతో ప్రపంచం మొత్తం ఆయన అభిమానులను సంపాదించారన్నారు. గ్రామానికి చెందిన విద్యార్థులకు సచిన్ తెండూల్కర్ క్రికెట్ బ్యాట్‌లను అందించారు.
ఘనస్వాగతం
పుట్టంరాజువారి కండ్రిగ గ్రామానికి వచ్చిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఆ గ్రామంలో మహేష్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లగా అతను ఇచ్చిన ఆతిథ్యానికి సచిన్ ముగ్ధుడైనాడు. సమావేశం చివరలో పుట్టంరాజు వారి కండ్రిగ ఓడిఎఫ్ గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేసిన తహశీల్దార్లు, ఎంపిడిఓ, టాస్క్ఫోర్స్ అధికారులకు అవార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహమ్మద్, గూడూరు శాసనసభ్యుడు పాశం సునీల్ కుమార్, ఎంఎల్‌సి వాకాటి నారాయణరెడ్డి, స్పోర్ట్స్ అధారిటి చైర్మన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

పుట్టంరాజుకండ్రికలో బుధవారం ఏర్పాటైన సభలో
మాట్లాడుతున్న మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్
కమ్యూనిటీ సెంటర్ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న సచిన్