ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధతకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, నవంబర్ 16: ప్రత్యేక హోదాకు సాటిరాగల అన్నిరకాల ప్రయోజనాలతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని కేంద్ర మాజీమంత్రి, బిజెపి జాతీయ మహిళామోర్చా ఇన్‌ఛార్జి దగ్గుబాటి పురంధ్రీశ్వరి అన్నారు. బుధవారం కడప జిల్లా రాజంపేటలో సీనియర్ బిజెపి నాయకుడు పోతుగుంట నాగేశ్వరరావు ఇంట్లో ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా ప్రకటనకు అడ్డంకిగా మారిన సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం హోదా వల్ల కలిగే ప్రయోజనాలు లభించేలా ప్రత్యేక ప్యాకేజీ రూపొందించిందన్నారు. రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసే అంశం పార్టీ అధిష్టానం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. అధిష్టానం పోటీచేయమంటే రాజంపేట నుంచి మరోసారి పోటీ చేస్తానన్నారు. పెద్దనోట్లు రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందన్నారు. నోట్ల రద్దు వల్ల తాత్కాలిక ఇబ్బందులున్నప్పటికీ, దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించి ప్రభుత్వానికి సహకరిస్తున్నారన్నారు. త్వరలోనే పెద్దనోట్ల రద్దు వల్ల తలెత్తిన తాత్కాలిక ఇబ్బందుల నుండి ప్రజలు బయటపడతారన్నారు.

బంగ్లా జాలర్లు అరెస్టు
కాకినాడ సిటీ, నవంబర్ 16: భారత సముద్ర జలాల్లోకి అక్రమంగా చొరబడ్డారనే అభియోగంపై బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు జాలర్లను అరెస్టుచేసినట్లు కాకినాడ మెరైన్ సిఐ బి రాజారావు తెలిపారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఇక్బాల్ గాజి(33), మహ్మద్ యసూమ్ జిల్లా(38), మహ్మద్ అలాలాప్‌మల్‌హ్(30) ఈనెల 2వ తేదీన బోటులో బంగ్లాదేశ్ తీరంలో చేపలువేట సాగిస్తుండగా వారి బోటులో డీజిల్ అయిపోయింది. బోటు విశాఖ సముద్రతీరానికి కొట్టుకొచ్చింది. ఈనెల 14వ తేదీన విశాఖ కోస్టుగార్డు సిబ్బంది వీరిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణ అనంతరం వారిని కాకినాడ మెరైన్ పోలీసులకు అప్పగించారు. బుధవారం కాకినాడ మూడవ అదనపుజ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.