ఆంధ్రప్రదేశ్‌

రాజమహేంద్రవరంలో ఫారెస్టు అకాడమీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 17: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పదవ షెడ్యూలులో భాగంగా రాజమహేంద్రవరం సమీపంలోని దివాన్ చెరువువద్ద ఫారెస్టు అకాడమీ ఏర్పాటవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ సమీపంలోని దులపల్లి వద్ద వుండే ఫారెస్ట్ అకాడమీని విభజించడంతో దివాన్‌చెరువు వద్ద ఎపి ఫారెస్టు అకాడమీ మంజూరయింది. విభజన చట్టంలో వచ్చిన ఈ ప్రాజెక్టును కూడా ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కొంతమంది ప్రయత్నించినప్పటికీ ముఖ్యమంత్రి ముందుగా ప్రకటించిన నేపథ్యంలో దివాన్‌చెరువు ప్రాంతంలో ఏర్పాటుకు రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చియ్య చౌదరి, పెందుర్తి వెంకటేష్ ప్రత్యేక శ్రద్ధ వహించడంతో ఎట్టకేలకు ఈ ప్రాంతంలో ఫారెస్ట్ అకాడమీ ఆవిర్భవిస్తోంది. దివాన్ చెరువు గ్రామం వద్ద అటవీ శాఖకు చెందిన సుమారు వంద ఎకరాల సువిశాల భూమిలో ఫారెస్టు అకాడమీని ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 19వ తేదీన అకాడమీ భవన సముదాయానికి శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబర్ నుంచి క్లాసులు ప్రారంభించనున్నారు. మొదటి బ్యాచ్‌గా సుమారు అరవై మంది ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లు, గార్డులు, బీట్ ఆఫీసర్లు తదితర అటవీ శాఖలోని వివిధ పోస్టులకు అవసరమైన శిక్షణ కల్పిస్తారు. ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రంలో వున్న ఆరుగురు అసిస్టెంట్ కన్జర్వేటర్లు, రేంజి ఆఫీసర్లు, ఇతర విభాగాల సిబ్బంది ఈ అకాడమీకి కేటాయించారు. కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కేడర్‌లో ఈ అకాడమీకి డైరెక్టర్‌ను ప్రభుత్వం నియమించనుంది. అకాడమీ పూర్తి స్థాయిలో నిర్మాణమయ్యేందుకు దాదాపు మూడేళ్ల కాలం పడుతుంది. అయితే ఈలోగానే డిసెంబర్ నుంచి తరగతులు ప్రారంభించాల్సి వుంది. ఇప్పటికే దివాన్‌చెరువు వద్ద అటవీ శాఖ పరిశోధనా కేంద్రంలోని భవన సముదాయాన్ని తరగతి గదులకు, హాస్టల్ భవనానికి, సిబ్బంది క్వార్టర్లకు కేటాయించి సుమారు 40 మంది శిక్షణార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. మిగిలిన ఇరవై మంది శిక్షణార్థులకు అపార్టుమెంట్ తీసుకుని హాస్టల్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఫారెస్టు పరిశోధనా కేంద్రంలో ఇపుడున్న సదుపాయం కాస్తా సెమినార్ భవనాలతో సహా సరిపోతుంది. వౌలిక సదుపాయాలను సిద్ధం చేయడంతో డిసెంబర్ నుంచి అకాడమీ పూర్తిస్థాయి కార్యకలాపాలు ఆరంభం కానున్నాయి. రీజినల్ ఫారెస్టు సెంటర్‌లో క్షేత్ర స్థాయి శిక్షణ కల్పించనున్నారు. భోజన శాల, లైబ్రరీ, లేబరేటరీ, జిమ్, విజిటర్స్ రూమ్స్, హాస్టల్ భవనం, తరగతి గదులు, సెమినార్ హాళ్లు, అధ్యాపకుల క్వార్టర్లు ఏర్పాటుచేశారు. అటవీ శాఖ ప్రాంతీయ పరిశోధనా క్షేత్రంలో దేశవ్యాప్త ప్రమాణాలు కలిగిన 148 అధ్యయన క్షేత్రాలు వున్నాయి.