ఆంధ్రప్రదేశ్‌

కర్నూలు జిల్లాలో 149 మంది డీలర్లపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 17: కర్నూలు జిల్లాలో రేషన్ దుకాణాలు నిర్వహిస్తున్న 149 మంది డీలర్లపై సస్పెన్షన్ వేటు పడింది. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ గురువారం ఆదేశించారు. వీరంతా రేషన్‌కార్డుదారుల ఆధార్, వేలిముద్రలతో సంబంధం లేకుండా అవకతవకలకు పాల్పడి నిత్యావసర వస్తువులను బ్లాక్‌మార్కెట్‌కు తరలించినట్లు విచారణలో తేలిందని జెసి స్పష్టం చేశారు. ఆన్‌లైన్ విధానంలో సరుకులు పంపిణీ చేయాల్సి ఉండగా హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్ఫర్‌మాటిక్ సెంటర్(ఎన్‌ఐపి)లో పనిచేసే ఒకరిద్దరు ఉద్యోగులతో కుమ్మక్కై సర్వర్‌లో మార్పులు చేర్పులు చేయించి నిత్యావసర వస్తువులు దుర్వినియోగం చేశారని వివరించారు. వారం క్రితం ఎన్‌ఐపికి చెందిన ఉద్యోగి, వారికి సహరించిన వారు, ముగ్గురు డీలర్లను అరెస్టు చేశామన్నారు. డీలర్లపై క్రిమినల్ కేసుల నమోదు, అరెస్టుల పరంపర ఆర్డీఓల పర్యవేక్షణలో జరగాలని ఆయన సూచించారు. అంతేకాకుండా అవకతవకలకు పాల్పడిన డీలర్లు ఇంకా ఎవరైనా ఉంటే నిగ్గు తేల్చాలని ఆర్డీఓలు, తహశీల్దార్లను జెసి ఆదేశించారు.