ఆంధ్రప్రదేశ్‌

అనాలోచిత నిర్ణయాలతో సామాన్యులకు కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 17: ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో పేద, సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. నల్లధనాన్ని అరికట్టేందుకు పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడాన్ని ఆక్షేపించాల్సి వస్తోందన్నారు. గురువారం గుంటూరులోని ఓ హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో అంబటి మాట్లాడారు. 94 సంవత్సరాల వయస్సు ఉన్న తన తల్లిని క్యూలో నిలబెట్టి 4,500 రూపాయలను తెచ్చుకోవడం వెనుక పబ్లిసిటీ స్టంట్‌ను ప్రజలు గమనించలేదనుకోవడం పొరపాటే అవుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నోట్ల సమస్యలను పరిష్కరించేందుకు గంటల తరబడి ఆలోచించానని చెప్పి తీరా క్యూలో ఉన్న వారికి మజ్జిగ, గ్లూకోజ్ నీళ్లు ఇవ్వాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇది కేవలం హెరిటేజ్ మజ్జిగను అమ్ముకోవడానికేనని ఎద్దేవాచేశారు.