ఆంధ్రప్రదేశ్‌

పట్టణ ఏటిఎంలలో రూ.50 నోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 17: పట్టణ ప్రాంతాల్లోని ఎటిఎంల్లో 50 రూపాయల నోట్లు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంత ఎటిఎంల్లో రూ.50 నోట్లను జారీ చేస్తున్నప్పటికీ పట్టణాల్లో, నగరాల్లో జారీ చేయలేదు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో చిల్లర సమస్యను అధిగమించేందుకు వీలుగా ఈ నోట్లను ఎటిఎంల్లో అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి రూ.146 కోట్ల మేరకు 50 రూపాయల నోట్లు చేరినట్లు అధికార వర్గాల సమాచారం. వీటిని ఎటిఎంల్లో అందుబాటులోకి తెచ్చేందుకు రెండు రోజుల సమయం పడుతుందని భావిస్తున్నారు. దీనివల్ల కొంతమేరకు చిల్లర సమస్య తీరుతుందంటున్నారు. ఐదు వందల నోట్లను ఎటిఎంల ద్వారా అందుబాటులోకి తెచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పిన నేపథ్యంలో రిజర్వు బ్యాంక్ నుంచి రెండు వేల రూపాయల నోట్లు అదనంగా రాష్ట్రానికి తరలించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అయితే రాష్ట్ర అధికారులకు రిజర్వు బ్యాంక్ అధికారులు అందుబాటులో లేకపోవడంతో 2000 రూపాయల నోట్ల రాక మరింత జాప్యం కానుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మంగానే 500 రూపాయల నోట్ల చలామణిలో జాప్యం చేస్తున్నట్లు భోగట్టా. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రెండు వేల రూపాయల నోట్లను రాష్ట్రానికి ఆర్‌బిఐ పంపినట్లు తెలిసింది. రాష్ట్రంలో వివిధ ఎటిఎంల ద్వారా 20, 50, 2000 రూపాయలను జారీ చేసేందుకు వీలుగా క్యాలిబ్రేషన్ చేయాల్సి ఉంది. బ్యాంక్‌లు ఈవిషయమై అంతగా స్పందించక పోవడంతో ఈ పనులు నత్తనడకన జరుగుతున్నాయి.
రేషన్‌షాపుల్లో నగర రహిత లావాదేవీలు
ప్రస్తుత కరెన్సీ సంక్షోభంలో చౌకధర దుకాణం డీలర్ ఇక బిజినెస్ కరస్పాండెంట్ (బిసి)గా సామాన్యజనానికి మరిన్ని సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇందుకు స్పందించిన డీలర్లు అనేక మంది తమ అంగీకారం తెలిపారు. ప్రస్తుతం ఉన్న సరుకులతో పాటు అదనంగా ఉప్పు, పప్పులు, కాఫీ, టీ పొడి వంటి నిత్యావసర వస్తువులు కూడా ఈ-పోస్ మెషిన్ల ద్వారా అందజేయడానికి డీలర్లు సంసిద్ధత వ్యక్తం చేశారు. వినియోగదారులు రూపే కార్డులను ఉపయోగించి రేషన్‌షాపుల్లో నగదు రహిత లావాదేవీ జరుపుకుంటే, నోట్ల కొరత సమస్య ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులు, తహశీల్దార్లు, చౌకధర దుకాణదారులతో విజయవాడ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ నుంచి పౌర సరఫరాల కార్యదర్శి బి రాజశేఖర్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

నోట్ల మార్పిడికి టోల్ ఫ్రీ నెంబర్
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పాత నోట్లను బ్యాంక్‌ల్లో మార్పిడి సమయంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు, సందేహాలను నివృత్తి చేసేందుకు టోల్ ఫ్రీ నెంబరు 1800-599-1111ను ఏర్పాటు చేశారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో 14 బ్యాంక్‌ల ప్రతినిధులు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వస్తున్న వివిధ సమస్యలను వారు పరిష్కరిస్తున్నారు. గత ఆరు రోజులుగా 2902 కాల్స్ వచ్చాయి. బ్యాంక్ ప్రతినిధులే కాల్స్‌ను రిసీవ్ చేసుకుంటుండటంతో సత్వరమే సమస్యలు పరిష్కారమవుతున్నాయి. వైద్య ఖర్చుల కోసం పెద్ద నోట్లను ఒక ఆసుపత్రి యాజమాన్యం అంగీకరించకపోవడంపై ఫిర్యాదు వచ్చింది.