ఆంధ్రప్రదేశ్‌

ఇలా అయతే ఇంతే సంగతి!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 17: తెలుగుదేశం పార్టీని ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు వయసును కూడా లెక్కచేయకుండా కష్టపడుతున్నారు. దానికి తమ మేధస్సు జోడించి సత్ఫలితాలిచ్చేలా చూడాల్సిన ముఖ్యమంత్రి కార్యాలయ ఐఏఎస్‌లు (సీఎంఓ) పార్టీ ఆశలకు అనుగుణంగా పనిచేయడం లేదని, తమకంటే సూటుబూటు వేసుకున్న వారికే రెడ్‌కార్పెట్ వేయడాన్ని తెలుగుదేశం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమకు కనీస గౌరవం దక్కడం లేదంటున్న నేతలు పేషీ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కష్టమేనని స్పష్టం చేస్తున్నారు. సీఎంఓను ప్రక్షాళన చేయాలన్న భావన మెజారిటీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సీఎంఓ కార్యాలయంలో కొందరు ఐఏఎస్ అధికారులు అనుసరిస్తోన్న నిర్లక్ష్యవైఖరి వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోందని తెదేపా సీనియర్లు, మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబు ఉదయం నుంచి రాత్రి వరకూ సమీక్షలు నిర్వహించి, పాలనను పరిగెత్తించి ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు చేర్చేందుకు కృషి చేస్తుంటే కొందరు అధికారులు నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు పార్టీలో చాలాకాలం నుంచి వినిపిస్తున్నాయి.
సీఎంఓ అంటే పార్టీకి రెండోకోణంగానే చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ పనిచేసిన వైఎస్, కిరణ్ వంటి ముఖ్యమంత్రులు సీఎంఓను అలాగే చూశారు. వైఎస్ హయాంలో పనిచేసిన సీఎంఓనే ఇప్పటివరకూ అత్యుత్తమమని తెదేపా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలే అంగీకరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, నేతలకు గౌరవం ఇచ్చి వారి సమస్యలను వైఎస్ వరకూ వెళ్లకుండానే పరిష్కరించేవారని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు సీఎం చెప్పిన పనులే కావడం లేదని, తాము అక్కడి అధికారులతో మాట్లాడటమే కష్టమైపోయిందని మంత్రులు సైతం వాపోతున్నారు. అధికారులు ఫోన్లు కూడా తీయడం లేదని, ఇది తమను అవమానించడమేనంటున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల కోసం ఒకవైపు బాబు ప్రపంచమంతా తిరుగుతుంటే, అధికారుల తీరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. పరిశ్రమల స్థాపన, సలహాల కోసం వచ్చిన పారిశ్రామికవేత్తలను ఒక అధికారి పరుషపదజాలంతో దుర్భాషలాడుతున్నారని, పెద్దపెద్దగా వేస్తున్న కేకలు ఆయన చాంబర్ బయట వేచి ఉన్న పారిశ్రామికవేత్తలకూ వినిపిస్తున్నాయని వివరిస్తున్నారు. ఇలాగైతే రాష్ట్రంలో పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఏ సీఎం అయినా పార్టీ ప్రతిష్ఠ పెంచే వాళ్లకే సీఎంఓలో అవకాశమిస్తారు. ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఒక అధికారి వచ్చిన వారిని తిడుతుంటారు. ఇంకో అధికారి మహిళలతో తప్ప మరెవరితోనూ ఎక్కువ మాట్లాడరు. మాకే వాళ్లు ఫోన్లు తీయరంటే మిగిలిన వారి పరిస్థితేమిటో మీరే గమనించండి. మా సార్ కూడా వారికి చాలా చనువు ఇస్తున్నారు. అదే ఇప్పుడు సమస్యగా మారింద’ని ఓ సీనియర్ మంత్రి సీఎంఓ పరిస్థితి గురించి వ్యాఖ్యానించారు. మరో అధికారి నేతలు, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నప్పటికీ, పేషీలో వారిని ఎక్కువసేపు కూర్చోపెట్టుకోవడంతో బయట చాలామంది వేచిచూడాల్సి వస్తోందని చెబుతున్నారు. సీఎం చెప్పిన పనులు కూడా కాలేని పరిస్థితులున్నాయంటే సందర్శకుల వ్యవస్థను కూడా మార్చాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.