ఆంధ్రప్రదేశ్‌

రిజర్వేషన్లు ఓటు బ్యాంకు రాజకీయాలేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 17: రిజర్వేషన్లు ఓటు బ్యాంకు రాజకీయాలకోసమేనా? మీరు సిఎం అయితే రిజర్వేషన్ రద్దుచేస్తారా?, చదలవాడ కళాశాలలో పామ్- డి చదువుతున్న ఓ విద్యార్థి కృష్ణసాయిరెడ్డి నారా లోకేష్‌ను ప్రశ్నించారు. ఇది సున్నితమైన అంశమని, ఆర్థికంగా వెనుబకడిన అన్ని కులాలలోని నిరుపేదలకు ప్రభుత్వం చేయూతనిస్తోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ సమాధానమిచ్చారు. గురువారం తిరుపతిలోని శ్రీ కృష్ణతేజ విద్యాసంస్థల్లో యువత చైతన్యసదస్సును నిర్వహించారు. నారాలోకేష్ ముందుగా ఎన్ టి ఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సదస్సుకు జిల్లాలోని సిద్దార్థ ఇంజనీరింగ్ , రాయలసీమ , కృష్ణతేజ , ఎన్ ఆర్ ఐ తదితర కళాశాలల నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నారాలోకేష్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 18 మంది విద్యార్థులు వేసిన వివిధ రకాల ప్రశ్నలకు నారాలోకేష్ ఓపిగ్గా సమాధానమిచ్చారు. ఇందులో ప్రధానంగా కృష్ణ సాయిరెడ్డి అనే విద్యార్థి ఎన్ని విమర్శలొచ్చినా ప్రధాని మోదీ పెద్దనోట్లను రద్దుచేసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని తన దమ్మును చాటుకున్నాడని, అదే తరహాలో రిజర్వేషన్లను రద్దుచేసి ఓసిలో ఉన్నత చదువులు చదువుకున్నవారికి మీరు చేయూత నిస్తారా?, రిజర్వేషన్ ఓటు రాజకీయాలు అనే మాటను మీరు సిఎం అయితే మారుస్తారా?, పార్లమెంటులో రిజర్వేషన్ రద్దుపై బిల్లువస్తే సమర్థిస్తారా? అని ప్రశ్నించారు.
ఇదే ప్రశ్నను మరో విద్యార్థి కూడా రిజర్వేషన్‌పై ప్రశ్నించారు. ఈసందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ఇది చాలా సున్నితమైన అంశమని, ఆవేశంగా దీనిపై ఏదో మాట్లాడటం సరికాదన్నారు. దీనిపై విస్తృతంగా చర్చజరిగి అందరి మద్దతు పొందాల్సిన అవసరం ఉంటుందన్నారు. అమెరికాలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయకుండా వారసత్వ రాజకీయాలవైపు మీ ప్రయాణం సాగుతూ ఉందా అన్న ప్రశ్నకు ఒక కుటుంబంలో ఒక డాక్టర్ ఉన్నా, లాయర్ ఉన్నా వారి పిల్లలుకూడా అటువైపే నడుస్తారన్నారు. ఎందుకంటే ఆ వృత్తికి సంబంధించిన అంశాలపై వారి కుటుంబంలోతరచూ చర్చలు జరుపుతూ ఉండడంతో పిల్లలు కూడా అటువైపు మొగ్గుచూపుతారన్నారు. ఎన్‌టిఆర్, తనతండ్రి చంద్రబాబునాయుడుల స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చారన్నారు.ప్రతి మనిషిలోను బలాలు, బలహీనతలు ఉంటాయని అందులో మంచి వాటిని స్వీకరించి ఎదగడమే యువత నేర్చుకోవాలన్నారు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, నారాయణ, ఎమ్మెల్సీలు గౌనివారి శ్రీనివాసులు, ముద్దుకృష్ణమనాయుడు, నరేష్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అమర్‌నాథరెడ్డి, శంకర్‌యాదవ్, సుగుణమ్మ, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ అశోక్‌రాజు, కృష్ణతేజ విద్యా సంస్థల చైర్మన్ చదలవాడ సుచరిత తదితరులు పాల్గొన్నారు.