ఆంధ్రప్రదేశ్‌

నోట్ల రద్దుపై పునఃసమీక్షించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురంటౌన్, నవంబర్ 17: పెద్దనోట్ల రద్దుపై పునఃసమీక్ష జరపాలని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం అనంతపురం నగరంలోని వివేకానంద జూనియర్ కాలేజీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజాబ్యాలెట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రఘువీరా మాట్లాడుతూ నోట్ల మార్పిడికి దేశంలోని 80 శాతం మంది ప్రజలు నానాపాట్లు పడుతుంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీ 90 ఏళ్ల తన తల్లిని ప్రచారం కోసం వాడుకోవటం దారుణమన్నారు. ఇది దేశ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమన్నారు. నల్లకుబేరులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని ధ్వజమెత్తారు. 80 శాతం మంది దేశ ప్రజలను రోడ్డుపాలు చేశారన్నారు. నరేంద్రమోదీ నిర్ణయాన్ని అధిక శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదాతో అభివృద్ధి చెందిన 13 రాష్ట్రాల్లో కేంద్రమంత్రి సుజనాచౌదరి ఒకసారి పర్యటిస్తే వాస్తవాలు బోధపడతాయన్నారు. ప్రత్యేక హోదాను చెల్లని నోటుతో పోల్చటాన్ని రఘువీరా తప్పుబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టుబట్టిమరీ పెద్ద నోట్లు రద్దు చేశాయన్నారు. రూ.2 వేల నోటు విడుదల చేయటం చూస్తే ఇది రూ.500, రూ. వెయ్యి కన్నా పెద్దదా చిన్నదా అన్న సందేహం వస్తోందన్నారు. పెద్ద నోట్లతో అవినీతిని తగ్గించవచ్చని పేర్కొంటూనే అంతకన్నా పెద్ద నోటును తీసుకురావటంలో గల ఆంతర్యమేమిటో వెల్లడించాలన్నారు. తెలుగుదేశం, బిజెపి ప్రభుత్వాలు ప్రజలను మాయ మాటలతో మోసపుచ్చుతున్నాయని రఘువీరా ధ్వజమెత్తారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన స్కాలర్‌షిప్పుల పెంపు, ఫీజు రీ యింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం వంటి హామీలతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ఆ తర్వాత వాటిని విస్మరించిందన్నారు. హోదా చెల్లని నోటులాంటిదని పేర్కొనటం ద్వారా ప్రజల ఆకాంక్షను దెబ్బతీయటం సరికాదన్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. హోదా కావాలంటే అవును, వద్దంటే కాదని బ్యాలెట్‌లో రాయాలని ఆయన విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు నాగరాజు, రమణ, కోటా సత్యం, దాదాగాంధీ, వాసు, కొండారెడ్డి, సుధాకర్, నాగరాజరెడ్డి పాల్గొన్నారు.

చిత్రం.. అనంతపురంలో ప్రజాబ్యాలెట్ నిర్వహిస్తున్న రఘువీరారెడ్డి