ఆంధ్రప్రదేశ్‌

ఇన్‌ఫ్లూయెంజా నివారణకు కాడిఫ్లూ వ్యాక్సిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా నివారణకు కాడిలా ఫార్మాస్యూటికల్స్, నోవారాక్స్ ఐఎన్‌సి, సిపిల్ బయోలాజికల్ సంస్థలు దేశీయంగా కాడిఫ్లూ ఎస్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించాయి. ఈ వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తి ఎలాంటి ఇన్‌ఫెక్షన్ల బారినపడే అవకాశాలు లేవని కాడిలా ఫార్మాస్యూటికల్స్ సంస్థ ఎండి డాక్టర్ రాజీవ్ మోదీ తెలిపారు.
గుజరాత్‌లోని అహమ్మదాబాద్ దోల్కా వద్ద వంద కోట్ల రూపాయల పెట్టుబడితో వ్యాక్సిన్ ఫెసిలిటీని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సంవత్సరం 25 మిలియన్ డోస్‌లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ ప్లాంట్‌కు ఉందన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర వ్యాక్సిన్‌లలో ఉండే వైరస్‌ల కారణంగా మానవ శరీరం లోపల వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయన్నారు. అలర్జీలతో బాధపడే వారికి కాడిఫ్లూ ఎస్ వ్యాక్సిన్ ఉపశమనం ఇస్తుందన్నారు.