ఆంధ్రప్రదేశ్‌

బయోడేటా ఆధారంగా ఎలా నియమించారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: కారెం శివాజీ ఇచ్చిన బయోడేటా ప్రాతిపదికపై అతడిని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా ఎలా నియమించారో వివరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. గురువారం హైకోర్టు ధర్మాసనం ఏపి ప్రభుత్వం, కారెం శివాజీ దాఖలు చేసిన పిటిషన్లను విచారించింది. కారెం శివాజీని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమించడం చెల్లదంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ కారెం శివాజీ ధర్మాసనం ఎదుట అపీల్ చేశారు. కమిషన్ చైర్మన్‌గా కారెం శివాజీని నియమించడానికి ప్రాతిపదికను వివరించాలని హైకోర్టు పిటిషనర్, ప్రభుత్వ న్యాయవాదులను ప్రశ్నించింది. అనంతరం ఈ కేసు విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.