ఆంధ్రప్రదేశ్‌

5000 కోట్లు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ 17: రిజర్వ్ బ్యాంకుకు మరోసారి లేఖ రాసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే రూ 1500 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు పంపాలని రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఉర్జీత్ పటేల్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సిఎం లేఖ రాశారు. అయితే రాష్ట్రానికి కేవలం రూ 142 కోట్లు మాత్రమే రావటంతో మరోసారి లేఖ రాయనున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఐదు వేల కోట్ల కరెన్సీ వెంటనే పంపాలని సిఎం లేఖ ద్వారా కోరనున్నారు. ఈ సందర్భంగా రిజర్వ్ బ్యాంకు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అధికారుల పనితీరు పట్ల ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. మొబైల్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు శుక్రవారం సర్వీస్ ప్రొవైడర్లతో సీఎం భేటీ కానున్నారు.
పెద్ద నోట్ల మార్పిడి పరిణామాలపై బ్యాంకర్లు జిల్లా ఉన్నతాధికారులతో విజయవాడలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి సమీక్షించారు. నగదు రహిత లావాదేవీలపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు.
పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కందిపప్పు, నూనెలు వంటి నిత్యావసర వస్తువుల బహిరంగ మార్కెట్ ధరలకన్నా తక్కువ ధరలతో ప్రజలకు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇ-పోస్ మిషన్లు, రూపే కార్డులు వీలైనంత ఎక్కువగా అందుబాటులోకి తేవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ట్రేడర్లందరూ ఇ-పోస్ మిషన్లు ఉపయోగించాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు సీఎం సూచించారు.