ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక హోదా చెల్లని నోటా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: ప్రత్యేక హోదా చెల్లని నోటు అంటూ కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడడం, ఎన్నికల్లో ఓటు వేసేందుకు డబ్బు తీసుకోవడం అవినీతి నిరోధక చట్టం కిందకు రాదని కోర్టులో చంద్రబాబు న్యాయవాది వాదించడంపై వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, సుజనా చౌదరి అహంకారంతో మాట్లాడుతున్నారని, ప్రత్యేక హోదాపై అభ్యంతరకరమైన భాషను వాడిన ఆయనకు ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించాలి తప్ప అలాంటి మాటలు మాట్లాడడం మంచిదికాదన్నారు. పెద్ద నోట్ల రద్దుపై 52 శాతం ప్రజలు హాయిగా ఉన్నట్లు సర్వేలో తేలిందని చంద్రబాబు చెబుతున్నారని, మరి క్షేత్ర స్థాయిలో పరిస్థితి అలా ఎందుకు లేదో చంద్రబాబు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
నల్లధనం వెలికితీతపై కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని సమర్ధిస్తామని, కాని అందుకోసం చేపట్టే చర్యల వలన సామాన్యులకు ఇబ్బందులు కలగకూడదని బొత్స అన్నారు. ఓటుకు నోటు కేసు కొత్త మలుపులు తిరుగుతోందని, ఈ కేసులో చంద్రబాబుకు శిక్ష ఖాయమని చెప్పారు. తన ఆస్తి కేవలం రూ.50 లక్షలని ప్రకటించిన చంద్రబాబు ఈ కేసులో తన తరఫున వాదించేందుకు ఢిల్లీ నుంచి వస్తున్న లాయర్‌కు రోజుకు రూ.10 లక్షల ఫీజు ఎలా చెల్లిస్తున్నారని ప్రశ్నించారు.
పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ముందుగానే తెలియడంతో చంద్రబాబు, ఆయన అనుచరులు జాగ్రత్త పడ్డారన్నారు. నోట్ల రద్దు సమాచారం ముందుగా అందడం వల్లనే చంద్రబాబు తన కుటుంబ సంస్ధ అయిన హెరిటేజ్‌ను ఫ్యూచర్ గ్రూప్‌కు అమ్మేసి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని, ఇది దేశ ద్రోహం కన్నా ఎక్కువని బొత్స ఆరోపించారు.