ఆంధ్రప్రదేశ్‌

సిమ్స్ కేసులో తొలి చార్జ్‌షీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 18: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సెక్యూర్డ్ ఇనె్వస్ట్‌మెంట్ మేకింగ్ సర్వీసెస్(సిమ్స్) కేసులో క్రైం ఇనె్వస్టిగేషన్ డిపార్ట్‌మెంట్(సిఐడి) తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. సిమ్స్‌కు సంబంధించి రెండు కంపెనీలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఎండి, డైరెక్టర్లు సహా 15 మందిపై అభియోగాలు నమోదు చేసింది. రిజర్వ్ బ్యాంకు నిబంధనలు, చట్టాలకు విరుద్ధంగా సిమ్స్ సంస్థ పలువురి నుంచి డిపాజిట్‌లు సేకరించింది. మూడేళ్ల కిందట సంస్థ చెల్లింపుల్లో జాప్యం జరగడంతో డిపాజిట్‌దారులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో సిమ్స్ కేసు దర్యాప్తును 2013 జూన్ 13న సిఐడికి అప్పగించింది. కేసు దర్యాప్తు అనంతరం సిమ్స్‌తో పాటు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో చోటుచేసుకున్న మోసాలకు బాధ్యులుగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.సురేంద్ర బాబు అలియాస్ గుప్త అతని భార్య భువనేశ్వరి దేవీ, ఆర్.తిరుమల రావు, టి.శ్రీనివాసరావు, కె.జగ్గారావు, ఎ.గోవిందం, వివివిఎఎన్ రాజారావు, ఎ.వెంకటేశ్వరరావు, పి.జయ అప్పారావు, ఎం.శ్రీనివాసరావు, వైవివి ప్రసాదరాజు, డి.రఘునాథం, ఎం.రాజరత్నంపై అభియోగాలను నమోదు చేసినట్టు సిఐడి దర్యాప్తు అధికారి ఎం.చిట్టిబాబు విలేఖరులకు వెల్లడించారు. సిమ్స్ సంస్థ 25,153 మంది డిపాజిట్ దార్ల నుంచి 45,894 ఖాతాల ద్వారా కోట్లాది రూపాయలు వివిధ పథకాల కింద డిపాజిట్‌లు వసూలు చేసిందన్నారు. తీసుకున్న డిపాజిట్‌లను సంస్థ ప్రతినిధులు సొంత ఆస్తుల కొనుగోలుకు, విలాసాలకు వెచ్చించారని, దీంతో సంస్థ ఆర్థిక ఇబ్బందులతో మూతపడిందన్నారు. సంస్థపై విశాఖ సహా గాజువాక, చోడవరం, అనకాపల్లి, పాయకరావుపేట, రాజమండ్రి, విజయనగరం తదితర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయన్నారు. సంస్థ మూతపడే నాటికి డిపాజిట్ దార్లకు రూ.129 కోట్లు బకాయి పడిందన్నారు. ఇదే సందర్భంలో సంస్థ వివిధ ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేసిందని, స్వాధీనం చేసుకున్న ఈ ఆస్తుల విలువ మథింపు చేయగా, రూ.50 కోట్ల వరకూ ఉన్నట్టు తేలిందన్నారు. సంస్థ ఆస్తులను ఎటాచ్ చేసి, వాటిని వేలం వేయడం ద్వారా వచ్చే మొత్తాన్ని డిపాజిట్ దారులకు చెల్లించేందుకు న్యాయస్థానం ద్వారా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. సంస్థ ప్రతినిధులపై సిఐడి తొలి ఛార్జ్‌షీట్ మాత్రమే నమోదు చేశామని, మరో 10 ఛార్జ్‌షీట్‌లు నమోదు చేస్తామని తెలిపారు. కేసు దర్యాప్తును ఈ ఏడాది చివర నాటికి పూర్తి చేస్తామన్నారు.