ఆంధ్రప్రదేశ్‌

నేటి నుంచి ఇందిరమ్మ శత జయంతి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 18: భారతదేశం గర్వించదగ్గ నేత, దివంగత ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాలు శనివారం నుంచి ఏడాది పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి వెల్లడించారు. ‘ఇందిరమ్మ రాజ్యం - ఇంటింటా సౌభాగ్యం’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళుతున్నట్లు నేడొక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసేందుకు ఛలో కోడుమూరు నినాదంతో శనివారం అక్కడ భారీ ఎత్తున రైతు సభ నిర్వహిస్తున్నామని ఇందులో పార్లమెంటరీ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, పలువురు ఎఐసిసి నేతలు పాల్గొంటారని తెలిపారు. ఇదే సభలో ఇందిరమ్మ జీవిత చరిత్రను తెలిపే ప్రత్యేక గీతాలతో కూడిన వీడియో క్యాసెట్‌ను ఆవిష్కరించనున్నామన్నారు.