ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, నవంబర్ 18: రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాస్వామ్యమా లేక రాచరికమా అని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో శుక్రవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల్లో కాపులను బిసిల్లో చేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చి మరిచిపోయిన తరువాత ఆ హామీని అమలు చేయాలని కాపులు రోడ్డెక్కారన్నారు. కాపు ఉద్యమాన్ని అణచివేసేందుకు అనేక రూపాల్లో ముఖ్యమంత్రి బెదిరిస్తున్నారని, వాటికి భయపడి ఉద్యమాన్ని వదిలి పారిపోమని ముద్రగడ స్పష్టంచేశారు. కాపులు ఉద్యమిస్తేనే కష్టాలు పుట్టుకొస్తాయా, ఇతరులెవరు రోడ్డెక్కి పోరాటాలు చేయడం లేదా అని ఆయన ప్రశ్నించారు. జిల్లాలోని రావులపాలెం నుండి అంతర్వేది వరకు గాంధేయమార్గంలో కాపు సత్యాగ్రహ యాత్ర ప్రారంభించడానికి సన్నాహాలు చేశామని, దీనికి బెదిరిపోయి ముఖ్యమంత్రి తనతో పాటు జిల్లాలో కాపు జెఎసి నాయకులను గృహ నిర్బంధానికి గురిచేయడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి పాలన కొనసాగిస్తే రాబోయేకాలంలో ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తారని ముద్రగడ హెచ్చరించారు. ఈ నెల 15,16 తేదీల్లో తాను గృహ నిర్బంధంలో ఉండగా పోలీసు అధికారులు తనను వచ్చి కలిశారని, వారితో పాటు వచ్చిన కొందరు పోలీసులు వీడియో కెమెరాలు, డ్రోను కెమెరాలతో తన ఇంటిని చిత్రీకరించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. భద్రత కోసం ప్రధాన రహదారుల్లో ఏర్పాటుచేసే సిసి కెమెరాలు, వీడియో కెమెరాలు ఇళ్లల్లో కూడా ప్రయోగించడం న్యాయమా అన్నారు. ఉద్యమాన్ని వదిలివేసి పారిపోయే జాతి తమది కాదన్నారు. డిసెంబర్ రెండో తేదీన కాకినాడలో 13 జిల్లాల కాపు జెఎసి నాయకులతో సమావేశం ఏర్పాటుచేసి రిజర్వేషను సాధించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని ముద్రగడ పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి రాసిన లేఖను పత్రికలకు విడుదల చేశారు.