ఆంధ్రప్రదేశ్‌

తప్పు చేస్తే ఎవరైనా జైలుకెళ్లాల్సిందే: లోకేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 18: ‘నేను తప్పు చేసినా జైలులో పెట్టించేందుకు మా నాన్న ఆలోచించడు. మా పార్టీలోని వ్యక్తులు ఎవరు తప్పు చేసినా జైలుకెళ్లాల్సిందే ’ అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. శుక్రవారం నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో ఆయన విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన పి.సాయి సంతోష్‌రెడ్డి అనే విద్యార్థి మాట్లాడుతూ వైకాపా అధ్యక్షుడు జగన్ పలుకేసుల్లో నిందితుడని పేర్కొంటున్న మీరు తమ పార్టీలో ఉన్న రేవంత్‌పై దాఖలైన కేసుల గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించడంతో లోకేష్ పైవిధంగా స్పందించారు. అదే విద్యార్థి వ్యవసాయ భూములు రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న ప్రభుత్వం జిడిపి పెరుగుదలకు వ్యవసాయమే కారణమని మరోవైపు వ్యాఖ్యానించడంపై ప్రశ్నించగా అమరావతి నిర్మాణం కోసమే తప్ప వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం కాదన్నారు. తాను కూడా పాలు, కూరగాయల వ్యాపారం చేశానని గుర్తు చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం ధనిక వర్గాల కోసమేననే ఆరోపణలు ఉన్నాయని శైలజ అనే విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ఇది అపోహ మాత్రమేనని చెప్పుకొచ్చారు. సైబారాబాద్ నిర్మాణం జరిగే సమయంలో కూడా ఎల్‌టి కంపెనీ కోసమే నిర్మాణం చేపట్టామని ఆరోపణలు వచ్చాయన్నారు. అమరావతిలో జరిగేది ప్రజా రాజధాని మాత్రమేనని, పేదలను ధనవంతులు చేయడమే తప్ప ధనికుల కోసం పనిచేసే ప్రభుత్వం తమది కాదని అన్నారు. దేశంలో జరిగే ప్రతి కుంభకోణంలోనూ ఆంధ్రప్రదేశ్ పేరు కీలకంగా వినిపిస్తోందని, దీనికి కారణమేంటని వినాయక్ అనే విద్యార్థి అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిస్తూ కుంభకోణాల్లో రాష్ట్రం పేరు వినిపిస్తున్న మాటలో నిజం లేకపోలేదని, అందుకే అవినీతి రహిత పాలన అందించేందుకు ప్రతి పనిని ఆన్‌లైన్ ద్వారా ప్రజలకు చేరువ చేస్తున్నామన్నారు. కృష్ణపట్నం పోర్టుకు భూములు జిల్లా వాసులిచ్చినప్పటికి ఉద్యోగాలు మాత్రం ఇతర ప్రాంతాలకు చెందిన వారికే ఎక్కువగా దక్కాయని ఒక విద్యార్థి లోకేష్ దృష్టికి తీసుకురాగా తాను వెంటనే పరిశీలించి భూములు కోల్పోయిన వారికి న్యాయం జరిగేలా చూస్తానని హామీనిచ్చారు. ప్రజల జీవితాల్లో వెలుగులు చూడాలనుకునే నేతలు తమ కుటుంబ ప్రయోజనాలను త్యాగం చేయక తప్పదని దీపిక అనే విద్యార్థిని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. తొలుత యువతనుద్దేశించి నారా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో అప్పులు ఆంధ్రప్రదేశ్‌కి, ఆస్తులు తెలంగాణాకు వెళ్లాయని అన్నారు. రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీయించేందుక ముఖ్యమంత్రి పాటుపడుతుంటే, ప్రతి అభివృద్ధి పనిని ఏదో రకంగా అడ్డుకోవాలని ప్రతిపక్షనేత పడని పాట్లంటూ లేవని దుయ్యబట్టారు.

చిత్రం.. సదస్సులో మాట్లాడుతున్న నారా లోకేష్