ఆంధ్రప్రదేశ్‌

అక్రమంగా తరలిస్తున్న వెండి, నగదు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, నవంబర్ 20: హైదరాబాదు నుండి తెనాలికి అక్రమంగా తరలిస్తున్న సుమారు పది లక్షల విలువైన వెండి, నగదును సర్కిల్ పోలీసులు అదివారం తెల్లవారుజామున కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. దీనికి సంబంధించి చిల్లకల్లు పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో సిఐ లచ్చునాయుడు వివరాలు తెలిపారు. తెనాలికి చెందిన వెండి వ్యాపారులు, తయారీదారులు ఐదుగురు శనగపల్లి వెంకట శ్రీనివాసరావు, గౌస్, త్రినాథ, అనిల్, పవన్, అనే వ్యక్తులు ఒక కారులో తెనాలికి వెళుతుండగా టోల్‌ప్లాజా వద్ద తనిఖీల్లో పట్టుబడ్డారు. వారి వద్ద నుండి 11కేజీల 600 గ్రాముల వెండి బిళ్లలు, వెండి బూంది పొట్లాలతో పాటు పాత కరెన్సీ రూ.1000, రూ.500నోట్లు రూ.4లక్షల 30వేల నగదు స్వాధీనపర్చుకున్నట్లు తెలిపారు. తెనాలికి చెందిన వీరంతా హైదరాబాదు, సికిందరాబాదులోని వివిధ జ్యూయలరీ షాపుల నుండి వెండి కొనుగోలు చేయడంతో పాటు వారు తయారు చేసిన వెండి వస్తువుల అమ్మకానికి సంబంధించిన నగదు కూడా వెంట తీసుకువెళ్తున్నారు. అయితే ఈ లావాదేవీలకు సంబంధించి వారి వద్ద ఎలాంటి బిల్లులు, ఆధారాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకొని చిల్లకల్లు పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో చిల్లకల్లు, జగ్గయ్యపేట ఎస్‌ఐలు వంశీకృష్ణ, వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

చిత్రం.. నగదు, వెండి వస్తువులతో పట్టుబడిన వ్యాపారులు