ఆంధ్రప్రదేశ్‌

తక్షణ ఉపశమనమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 20 : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నెలకొన్న సంక్షోభం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడమే బ్యాంకర్లు, అధికారుల ముందున్న తక్షణ కర్తవ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నోట్ల మార్పిడిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆదివారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్‌బిఐ, ఎస్‌ఎల్‌బిసి, ఆర్థిక శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్న ఈ కాన్ఫరెన్స్‌లో సిఎం మాట్లాడుతూ సెలవు దినమైనప్పటికీ, సమస్య తీవ్రత దృష్ట్యా ఈ సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక సమస్య ఇన్నాళ్లు అపరిష్కృతంగా ఉండటం తన రాజకీయ జీవితంలో ఇదే మొదటిసారి అని, తుపాన్ల వల్ల కలిగిన నష్టాన్ని కూడా 8 రోజుల్లో అధిగమించిన విషయాన్ని గుర్తు చేశారు. నోట్ల రద్దు సమస్య 12 రోజులైనా కొలిక్కిరాకపోవడం బాధాకరమన్నారు. తనకే చాలా అసహనంగా ఉందని, ప్రజల సహనాన్ని మెచ్చుకోవాలన్నారు. బ్యాంకర్లు, ఆర్థిక శాఖ అధికారులు తక్షణమే స్పందించి ప్రజలకు ఉపశమనం కల్పించాలన్నారు. బ్యాంక్‌లకు, ప్రజలకు మధ్య కమాండ్ కంట్రోల్ వారధిగా పని చేయాలని, కంట్రోల్ రూమ్‌కు వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలన్నారు. ప్రజలు ఇస్తున్న సహకారాన్ని దృష్టిలో ఉంచుకుని, వారికి మరింత ఉపశమనం ఇచ్చేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలన్నారు.
రాష్ట్రానికి మరో 2000 వేల కోట్ల రూపాయలు వచ్చాయని, అందులో 400 కోట్ల మేరకు వంద నోట్లు ఉన్నాయని సిఎం తెలిపారు. దీని వల్ల సోమవారం నుంచి ప్రజలకు కొంత మేర ఉమశమనం కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ని బ్యాంక్‌ల్లో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, ప్రజలకు తాజా సమాచారం అందించాలన్నారు. జిల్లాల్లో ఏ మేరకు నగదు అవసరమో అంచనా వేసి ఆయా ప్రాంతాలకు పంపాలన్నారు. కరెన్సీ చెస్టులు ఉన్న బ్యాంక్‌లు అవి లేని బ్యాంక్‌లకు నగదు అందించాలని, గ్రామీణ ప్రాంతాల్లో నగదు కొరత లేకుండా చూడాలన్నారు. జన్‌ధన్ ఖాతాలను, రూపే కార్డులను తక్షణమే యాక్టివేట్ చేయాలన్నారు. టిక్కెట్ కౌంటర్ల వద్ద ఇ-పోస్ యంత్రాలను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ లావాదేవీల శిక్షణకు విద్యార్థుల సేవలను ఉపయోగించుకోవాలన్నారు. సమన్వయంతో పని చేయని, సహకరించని బ్యాంక్‌లకు నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. ఈ సమీక్షలో ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ కల్లాం, ఆర్బీఐ జిఎం సుబ్బయ్య, ఇన్‌చార్జి డిజిపి సాంబశివరావు, వివిధ శాఖల అధికారులు సునీత, రాజశేఖర్, వల్లీకుమారి తదితరులు పాల్గొన్నారు.