ఆంధ్రప్రదేశ్‌

చట్టపరిధిలోకి ప్రైవేట్ అంతరిక్ష కార్యకలాపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 20: అంతరిక్షంలో ప్రైవేట్ సంస్థలను అనుమతించడం, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో అంతరిక్ష కార్యకలాపాలు చేపట్టే సందర్భంలో వాటిని చట్టపరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ న్యాయ కోవిదుడు, ఎపి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.్భవానీ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ శాంతి భద్రతలు, మానవాభివృద్ధికి అంతరిక్షం, భూ వినియోగంపై మూడు రోజులుగా జరుగుతున్న సదస్సు ముగింపు సందర్భంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాసా చేపట్టిన కమర్షియల్ రీసప్లై సర్వీసెస్(సిఆర్‌ఎస్) కార్యక్రమంలో మూడు ప్రైవేటు సంస్థల ద్వారా భవిష్యత్‌లో 30కి పైగా అంతరిక్ష ప్రయోగాలు జరగనున్నాయని పేర్కొన్నారు. ప్రయోగాల ఫలితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ ఉపగ్రహాలు విఫలమైతే అవి సృష్టించే వినాశనానికి ఎవరు బాధ్యత వహించాలనే న్యాయపరమైన విషయాలకు ప్రాధాన్యత ఏర్పడుతోందన్నారు. ప్రపంచంలో పలు దేశాలు అంగీకరించిన ఔటర్ స్పేస్ ట్రీట్(ఓఎస్‌టి)లో ఉమ్మడి చట్టాలను రూపొందించాల్సి ఉందన్నారు. అదేవిధంగా ట్రాకర్ ఉపగ్రహాల ద్వారా ప్రైవేటు వ్యక్తుల సహకారంతో ఇతర దేశాలపైన, వ్యక్తిగత వ్యవహారాలపైన నిఘా ఉంచడాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో పనిచేయడం మాని ప్రజల ఆకాంక్షలను, సమాజాభివృద్ధిని కాంక్షించే దిశగా పనిచేసినప్పుడే ప్రపంచ శాంతికి మార్గం ఏర్పడుతుందని భవానీ ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
జపాన్ కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి యసువో ఒగట్టా మాట్లాడుతూ గాంధీ మహాత్ముని ఆశయాలను సాధించే దిశగా అడుగులు వేయాలని కోరారు. మూడు రోజుల పాటు ‘గీతం’లో జరిగిన ఈ సదస్సులో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొనడాన్ని ఆయన అభినందించారు. అమెరికా, జపాన్, నేపాల్, దక్షిణ కొరియా, భారత్‌కు చెందిన పలువురు ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ముందుగా గీతం యూనివర్శిటీ ప్రొ వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ శివరామకృష్ణ మాట్లాడుతూ ప్రజలు శాంతియుత సమాజంలో మనుగడ సాధించినప్పుడే మానవాభివృద్ధికి అస్కారం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో గీతం యూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం పోతరాజు, గీతం స్కూల్ ఆఫ్ లా డైరెక్టర్ ప్రొఫెసర్ వై.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.