ఆంధ్రప్రదేశ్‌

సిపిఎస్ రద్దుకు జాతీయస్థాయి ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 20: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సిపిఎస్) రద్దుకు ఉద్యమం తప్పదని ఎపి ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు హెచ్చరించారు. ఇక్కడ ఆదివారం జరిగిన ఎపిఎన్జీవో సంఘం కౌన్సిల్ సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి, మాట్లాడారు. దేశంలో పశ్చిమబెంగాల్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఈ సిపిఎస్ విధానం అమల్లో ఉందని, అందువల్లనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి తెచ్చేందుకు జాతీయ స్థాయిలో పోరాటం తప్పదని ఆయన స్పష్టం చేశారు. అఖిలపక్ష నేతలను కలుపుకొని ఈ పోరాటం సాగిస్తామని చెప్పారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చేయాలన్నదీ తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. అందుకు విజయనగరం నుంచే ఉద్యమానికి ఊపిరినివ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల మంజూరు గురించి ప్రస్తావిస్తూ గ్రూప్ హౌసింగ్ కింద ప్రభుత్వ ధరకు ఉద్యోగులు ఇళ్ల స్థలాలు పొందే అవకాశం ఉందన్నారు. ఏటా రూ.6లక్షల ఆదాయం ఉన్న వారికి ప్రభుత్వం రూ.1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఆ మొత్తాన్ని స్థలం కింద వెచ్చిస్తే ఉచితంగా ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు మంజూరయ్యే అవకాశం ఉందని వివరించారు. దాంతోపాటు ఉద్యోగులకు, పింఛనుదారులకు వన్‌టైమ్ టోటల్ హెల్త్‌చెకప్ సదుపాయం, ఇతర వాటి గురించి చర్చించేందుకు ఈ నెల 23న విజయవాడలో ప్రధాన కార్యదర్శి సమక్షంలో స్టీరింగ్ కమిటీ సమావేశం కానుందని తెలిపారు.
ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు ఆదేశానుసారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న డిమాండ్‌తో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇవ్వాలన్న డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్న ధ్యేయంతో ఉన్నామన్నారు.
కరెన్సీ నోట్ల రద్దు గురించి ప్రస్తావించగా ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం శుభపరిణామమన్నారు. ఈ చర్య వల్ల దేశంలో స్థూలజాతీయోత్పత్తి పెరగగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు డివి రమణ, జిల్లా సంఘం అధ్యక్షుడు ప్రభూజీ పాల్గొన్నారు.