ఆంధ్రప్రదేశ్‌

గ్రామాధికారుల పాలన రద్దుతో బ్రాహ్మణులు ఆర్థికంగా వెనుకబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, నవంబర్ 20: గ్రామాధికారుల పాలన రద్దు చేయడంతో బ్రాహ్మణులు వెనుకబాటుతనంలో నిలిచిపోయారని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. బ్రాహ్మణోత్తముల సహకారంతో ఏర్పాటైన రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ద్వారా కల్పిస్తున్న బ్రాహ్మణ సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు ఆదివారం చిత్తూరుజిల్లా మదనపల్లె పట్టణంలో నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ గ్రామాధికార పాలనలో బ్రాహ్మణులకు ఉన్న భూములను ఇతరులకు గుత్తకివ్వడం, వాటిద్వారా వచ్చే అరకొర ఆదాయంతో ఆర్థికంగా ముందుండేవారని అన్నారు. గ్రామాధికారపాలన రద్దు చేయడమే కాకుండా, దునే్నవారిదే భూమి అన్న నినాదంతో బ్రాహ్మణుల భూములు సైతం వదిలివేయడం, దీని కారణంగా ప్రాధాన్యత తగ్గిపోయి వెనుకబాటుతనానికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు కలుషితం కావడంతో అందులో బ్రాహ్మణులు ఇమడలేకపోయారని అన్నారు. నేడు సమాజంలో బ్రాహ్మణుల ఉనికి చాటుకోవాలంటే రాజకీయ రంగప్రవేశం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దునే్నవాడిదే భూమి అన్న నినాదంతో బ్రాహ్మణుల భూములు ఆక్రమించుకోవడంతో ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నామన్నారు. నేటి ప్రపంచంలో బ్రాహ్మణులు రాజకీయంతో పాటు, తమ వంతు పరిశ్రమలు ఏర్పాటుచేసి, ఇతరులకు ఉపాధి అవకాశాలు కల్పించి సామాజిక బాధ్యత తీసుకోవాలన్నారు. ఆర్యవైశ్యులు మనతో కలిస్తే రానున్న ఎన్నికలలో రాష్ట్రంలో 20 ఎమ్మెల్యే సీట్లు సాధించుకుని దశదిశా నిర్దేశం చేసుకోవచ్చునని ఆయన తెలిపారు.