ఆంధ్రప్రదేశ్‌

బకింగ్‌హామ్ కెనాల్‌లో ముగ్గురి గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి, నవంబర్ 21: గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరంలో బకింగ్‌హామ్ కెనాల్‌లో సోమవారం ప్రమాదవశాత్తూ ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. విజయవాడలోని శాంతినగర్, రాజీవ్‌నగర్‌కు చెందిన ఐదుగురు స్నేహితులు సోమవారం సీతానగరంలోని బకింగ్‌హామ్ కాలువ హెడ్ స్లూయిజ్ సమీపంలో కాలువలోకి దిగి చేపలు పట్టడానికి ప్రయత్నిస్తుండగా అంజి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. పక్కనే ఉన్న మాణిక్యం అనే యువకుడు అంజిని పట్టుకోటానికి ప్రయత్నించాడు. దీంతో ఇద్దరూ నీటిలో కొట్టుకుపోతుండగా పక్కనే ఉన్న మరో యువకుడు వారిద్దరినీ కాపాడటానికి ప్రయత్నించి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీంతో వీరితో ఉన్న మరో ఇద్దరు వారిని ఒడ్డుకు చేర్చటానికి ప్రయత్నించినా ఫలితం దక్కకపోవటంతో ముగ్గురు యువకులు బకింగ్‌హామ్ కెనాల్‌లో గల్లంతయ్యారు.