ఆంధ్రప్రదేశ్‌

ఆర్‌బిఐ ఆంక్షలతో రైతులు విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 21: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలతో సహకార బ్యాంకులు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. కేంద్రం రద్దు చేసిన రూ.500, రూ.వెయ్యి నోట్లు ఇతర బ్యాంకులలో చెల్లుబాటు అవుతున్నప్పటికీ సహకార బ్యాంకులలో చెల్లుబాటుకాకపోవడం వల్ల అటు రైతులు, ఇటు బ్యాంకులు విలవిల్లాడుతున్నాయి. సహకార బ్యాంకులలో రద్దయిన నోట్లతో డిపాజిట్లు స్వీకరించరాదని ఆర్‌బిఐ ఆంక్షలు విధించడం వల్ల సహకార బ్యాంకులు ఇరకాటంలో పడ్డాయి. ఒకపక్క రబీ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు పెట్టుబడుల కోసం సహకార బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా, సహకార బ్యాంకులు పాతనోట్లు స్వీకరించడానికి అవకాశం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
సాధారణంగా రాష్ట్రంలో రైతులు రుణాల కోసం వాణిజ్య బ్యాంకుల కంటే సహకార బ్యాంకులపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సహకార బ్యాంకుల ద్వారా రూ.8604 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, రూ.6022 కోట్లు పంపిణీ చేయగలిగారు. అలాగే రబీలో రూ.2581 కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సహకార బ్యాంకులకు డిపాజిట్లు లేకపోవడం వల్ల అటు రైతులు, ఇటు సహకార సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే తమకు పాత నోట్లు డిపాజిట్లు స్వీకరించేందుకు అనుమతి ఇవ్వాలని సహకార బ్యాంకులు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై పిఎసిఎస్ ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.కృష్ణంరాజు మాట్లాడుతూ సహకార బ్యాంకులకు పాతనోట్లు అనుమతించాలని కోరుతూ ఈ నెల 25న దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె చేపట్టనున్నట్టు తెలిపారు.