ఆంధ్రప్రదేశ్‌

అమిత్ షా రైతుసభకు కరెన్సీ కష్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, నవంబర్ 21: పెద్ద నోట్ల రద్దు ప్రభావం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీపై కూడా పడింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొనే సభ ఏర్పాట్లకు కరెన్సీ దొరకక స్థానిక నేతలు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళితే... భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ నెల 26న భారీ రైతు సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు సుమారు లక్ష మంది వస్తారని అంచనా. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సభలో పాల్గొని రైతులకు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించనున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సొంత నియోజకవర్గం కావడంతో ఏర్పాట్లు భారీగానే చేపట్టారు. ఈ మొత్తం కార్యక్రమానికి సుమారు రూ.2కోట్లు ఖర్చవుతుందని అనధికారిక అంచనా. ఒక వేదిక నిర్మాణానికే సుమారు రూ.30 లక్షలు ఖర్చవుతుందని అంచనా. సాధారణంగా పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించే ఇలాంటి భారీ కార్యక్రమాలకు పార్టీ ప్రజాప్రతినిధులు, పెద్ద నేతలు కొంత కొంత చందాలు వేసుకుంటారు. అయితే తాజాగా పెద్ద నోట్ల రద్దు వ్యవహారంతో దాదాపు అందరివద్దా కరెన్సీ కరువయ్యింది. సభకు వేదిక నిర్మాణం నుంచి షామియానా, బ్యారికేడ్లు, ఇతర ఏర్పాట్లకు పాత కరెన్సీని ఆంగీకరించడంలేదు. దీనితో ఏర్పాట్లకు అవసరమైన చిల్లర నోట్ల కోసం మల్లగుల్లాలు పడుతున్నారు.
వాట్సాప్‌లకు ఐటిశాఖ నోటీసులు
అధిక మొత్తంలో బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేస్తున్న వారికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులను పంపిస్తోంది. సొమ్ము బ్యాంకులో జమచేసే సమయంలో రాసిన ఫోన్ నెంబరుకు ఐటి శాఖ కొన్ని గంటల్లోనే నోటీసులను వాట్సప్ ద్వారా పంపిస్తోంది.