ఆంధ్రప్రదేశ్‌

పెద్దనోట్ల రద్దుపై గజ్జెకట్టిన ఎంపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 21: పెద్దనోట్లు రద్దుపై ప్రధాని తీసుకున్న నిర్ణయంతో మంచి రోజులు రావాలంటే ఇంకెంత మంది చనిపోవాలంటూ ప్రధాని నరేంద్రమోదీని చిత్తూరు పార్లమెంటు సభ్యులు శివప్రసాద్ సూటిగా ప్రశ్నించారు. స్వతహాగా కళాకారుడైన డాక్టర్ ఎన్ శివప్రసాద్ సోమవారం తిరుపతి ఎస్‌బిఐ కార్యాలయం ఎదుట బుర్రకథ కళాకారుని వేషంలో రోడ్డుపై మోదీకి నిరసనగా, పెద్దనోట్ల రద్దుపై ప్రజల అవస్థలను కళ్లకు కట్టినట్టు బుర్రకథ రూపంలో వినిపించి ప్రజలను ఆకర్షించారు.
అదే సమయంలో పేదల అవస్థలపై ప్రధానిపై విరుచుకుపడ్డారు. కళాకారుడైన ఎంపి శివప్రసాద్ గతంలో పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై భిన్న వేషాలు, భిన్న విధానాలతో కేంద్రానికి నిరసనలు తెలియజేస్తున్న విషయం పాఠకులకు విదితమే. ఈ క్రమంలో పెద్దనోట్లు రద్దుపై సామాన్య, మధ్యతరగతి ప్రజల అవస్థలను చూసి చలించి ఇద్దరు సహ కళాకారులతో కలిసి ఎస్‌బిఐ బ్యాంకు వద్ద నోట్ల రద్దుపై ప్రజలు పడుతున్న కష్టాలపై బుర్రకథను రాగయుక్తంగా ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని తీసుకున్న ఏకపక్ష నిర్ణయం సామాన్య, మధ్యతరగతి ప్రజలకే కష్టం తెచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మోదీకి సంసార సముద్రాన్ని ఈదే పేదల కష్టాలు తెలిసినట్లు లేదన్నారు. భార్య పిల్లలకు దూరంగా ఉన్నవారిని రాజకీయాల్లో దూరంగా పెట్టాలని ఎంపి అభిప్రాయపడ్డారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న కష్టాలపై శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తానని ఆయన స్పష్టం చేశారు.

చిత్రం.. తిరుపతి ఎస్‌బిఐ ఎదుట నిరసన తెలియజేస్తున్న చిత్తూరు పార్లమెంటు సభ్యులు శివప్రసాద్