ఆంధ్రప్రదేశ్‌

అన్ని శాఖల్లో ‘పెమండు’ అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: రాష్ట్రంలోని అన్ని విభాగాల్లో స్థిరమైన, సమ్మిళిత వృద్ధిని సాధించాలనే ధ్యేయంతో నిర్వహణ యాజమాన్య బట్వాడా యూనిట్ (పెమండు)ను అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని శాఖల నిర్వహణను, యాజమాన్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆయా శాఖలు పనితీరును మెరుగుపరుచుకునేలా సూచనలు, సలహాలతో పాటు కార్యక్రమాలను వేగవంతం చేయడం, ఐటిని వినియోగించుకోవడం, సిబ్బందిని చైతన్యపరచడం వంటి చర్యలను చేపడతారు. మలేషియా ప్రభుత్వం ఈ విధానాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. అదే నమూనాను రాష్ట్రప్రభుత్వం చేపట్టింది. ఇందుకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ప్రత్యేకంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఈ కేంద్రం పర్యవేక్షణ బాధ్యతలను ఇద్దరు సీనియర్ ఐఎఎస్ అధికారులకు అప్పగించారు. ఈ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సందర్శించనున్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఏపి ప్రణాళికా విభాగం ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ సంస్థాగత సౌకర్యాలను ఇటీవలే కల్పించుకుంది. ఈ యూనిట్ లోతుపాతులను, అమలుజరుగుతున్న విధానాన్ని చంద్రబాబు స్వయంగా పరిశీలించనున్నారు. ‘పెమండు’ ల్యాబ్స్‌లో ప్రణాళిక విభాగం సిద్ధం చేసిన ఆరు వర్కు స్ట్రీమ్స్ ఫలితాలపై కూడా సిఎం సమగ్రంగా అధ్యయనం చేస్తారు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఆర్‌పి సిసోడియా, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి జి. అనంతరాము ఈ ల్యాబ్‌కు బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు.
సిఎం అధ్యక్షతన ల్యాబ్ భాగస్వామ్య వాటాదారులతో సంయుక్త సమావేశం కూడా బుధవారం జరగనుంది. రాష్ట్రంలో అత్యుత్తమ పాలనా పద్ధతులను తీసుకురావాలన్న ఉద్దేశంతో కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం మలేషియా ప్రభుత్వంతో పెమండు (పెర్‌ఫార్మెన్స్ అండ్ మేనేజిమెంట్ డెలివరీ యూనిట్) విధానంపై ఒక ఒప్పందం కుదుర్చుకుంది. తొలుత దీనిని విద్యాశాఖ, రిటైల్ సెక్టారులో అమలుచేయాలని నిర్ణయించారు.