ఆంధ్రప్రదేశ్‌

బాబును సంప్రదిస్తే బావుండేది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 21: పెద్ద నోట్ల రద్దును సామాన్య ప్రజలు సైతం స్వాగతిస్తున్నారనీ, అయితే ఏఒక్కరూ ఇబ్బందిపడకుండా ముందుగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టటంలో ప్రధాని నరేంద్ర మోదీ ఘోరంగా విఫలమయ్యారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. పరిపాలనా దక్షత, అన్ని రంగాల్లోనూ ఎంతో అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబును విశ్వాసంలోకి తీసుకుని సూచనలు, సలహాలు పాటించి వుంటే అటు బిజెపి ఇటు టిడిపిపై ప్రజల్లో ఇంతటి వ్యతిరేకత వచ్చేదికాదని అభిప్రాయపడ్డారు. పెద్దనోట్ల రద్దు గురించి, ఎన్నికలకు ముందు నుంచీ రాజకీయ అవినీతిని పారదోలేందుకు చంద్రబాబు పోరాడుతూనే ఉన్నారన్నారు. కేంద్రానికి దీనిపై బహిరంగ లేఖ కూడా రాశారని గుర్తుచేశారు. మోదీ అడగకుండానే బాబు తనంతట తానుగా ఎందుకు సూచనలు ఇవ్వాలంటూ వారు ప్రశ్నించారు. విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా నోట్ల రద్దు వ్యవహారం ఆరోజు రాత్రి టీవీలో స్క్రోలింగ్ వచ్చి ఇంటలిజెన్స్ డిజి తెలిపేంత వరకు బాబుకు తెలియదన్నారు. నోట్ల రద్దు వ్యవహారంలో హెరిటేజ్ సంస్థను లాగటం ఎంతమాత్రం క్షంతవ్యం కాదని, అత్యంత అవినీతిపరుడైన ప్రతిపక్ష నేత జగన్‌కు బాబు నైతికత గురించి మాట్లాడే హక్కులేదని ఖండించారు. తెలంగాణ సిఎం కెసిఆర్ నేరుగా ప్రధానిని కలిసినప్పటికీ చంద్రబాబు అనుక్షణం సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు కేంద్రంతో చర్చిస్తూనే ఉన్నారని మంత్రి పుల్లారావు చెప్పారు. నోట్ల రద్దుపై రాష్ట్రంలో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని, తాజాగా ఉల్లి ధరలు పడిపోయాయన్నారు. పెద్దనోట్లు రద్దుచేసి 13రోజులు గడుస్తున్నా నేటికీ సాధారణ పరిస్థితులు నెలకొనకపోవటం బాధాకరమన్నారు. పైగా చంద్రబాబుకు ఈవిషయం ముందుగానే తెలిసి సర్దుబాటు చేసుకున్నారనటం దారుణమన్నారు. ముద్దుకృష్ణమ నాయుడు మాట్లాడుతూ పివి నరసింహరావు ప్రధానిగా, రాష్ట్రంలో నేదురుమల్లి జనార్దనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 1991లో ప్రైవేట్ రంగంలో హెరిటేజ్‌కు డెయిరీకి అనుమతి లభించిందని గుర్తుచేశారు. రాజకీయాల్లోకి వచ్చాక తొలుత చంద్రబాబు, తాజాగా లోకేష్ ఆ వ్యాపారం నుంచి తప్పుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారని తెలిపారు.