ఆంధ్రప్రదేశ్‌

పేదలకు సెల్‌ఫోన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 24: రాష్ట్రంలో మొబైల్ ఫోన్లు లేని పేదలందరికీ ఫోన్లు సమకూర్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. డిజిటల్ లావాదేవీలు జరపడానికి వీలుగా అందరికీ ఫోన్లు ఉండాలని, అందుకే ఈ ఆలోచన అమలు చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పెద్ద నోట్ల రద్దు పరిణామాలపై కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ నుండి బ్యాంకర్లు, ఆర్బీఐ అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. సాధారణ పరిస్థితులు వచ్చేవరకు ఈ కసరత్తు కొనసాగించాల్సిందేనన్నారు. 1వ తేదీ కల్లా ప్రజల ఆర్థిక లావాదేవీల్లో సమస్యలు లేకుండా చూడడమే మన ముందున్న లక్ష్యమన్నారు. 28, 29వ తేదీ కల్లా రాష్ట్రానికి మరో రూ. 3వేల కోట్లు రానుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆర్బీఐ అధికారులు వివరించారు. వీటిలో రూ. 60 కోట్ల వరకు చిన్న నోట్లు ఉండవచ్చని సిఎంకు వారు వెల్లడించారు. జన్‌ధన్, రూపే కార్డులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టమని అన్ని బ్యాంకులకు సూచించినట్లు బ్యాంకర్లు సిఎంకు ఈ సందర్భంగా వివరించారు.

చిత్రం... బ్యాంకర్లతో సమీక్షలో మాట్లాడుతున్న చంద్రబాబు