రాష్ట్రీయం

వీసా.. అంత తేలిక కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 28: అమెరికాలో వీసా నిబంధనలు, ఫీజులు, మంజూరు పద్ధతుల్లో మార్పు రావడం తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు పెను నష్టాన్ని తెస్తుందని అంచనా వేస్తున్నారు. అమెరికాలో జరిగిన ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికై జనవరిలో బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్నా, ఆయన ఆలోచనల సరళిలలోనే అమెరికాలో వీసా విధానాల్లో వేగంగా మార్పులు వస్తున్నాయి. భారత్ నుండి అమెరికాలో 1,65,918 మంది విద్యార్థులు చదువుతుండగా, 10 లక్షల మందికిపైగా ఉద్యోగాల్లో ఉన్నారు. ప్రధానంగా బిజినెస్ వీసా, వర్కు వీసా, విద్యార్ధి వీసా, ఎక్స్చ్‌ంజి వీసా, క్రూ వీసా, డొమెస్టిక్ ఎంప్లాయి వీసా, జర్నలిస్టు వీసా, టూరిస్టు వీసా వంటి కేటగిరిలున్నాయి. వీటిలో మొత్తం 78 రకాల వీసాలను మంజూరు చేస్తోంది. భారత్ నుంచి వెళ్లేవారిలో ఎక్కువ మంది హెచ్-1బి కింద వెళ్తుంటారు. అంటే స్పెషాలిటీ ఉద్యోగులకు ఇచ్చే నాన్ ఇమిగ్రెంట్ వీసా. అలాగే ఎల్-1 కింద ఉద్యోగులు ఇంట్రా కంపెనీ ట్రాన్స్‌ఫర్ వీసా పొందుతారు. ఇక విద్యార్ధులకు ఎఫ్-1, ఎం-1 వీసాలు మంజూరు చేస్తున్నారు. ఇనె్వస్టర్లకు ఇ-1, ఇ-2, ఎక్చ్సేంజి కింద జె-1, అత్యధిక ప్రతిభా పాటవాలున్న వారికి ఓ-1, ఆర్టిస్టులకు పి-1 వీసాలు ఇస్తున్నారు. అయితే దాదాపు 70 రకాల వీసాల కింద భారత్ నుండి విద్యార్థులు, ఉద్యోగులు, ప్రముఖులు ప్రతి ఏటా అమెరికా వెళ్తున్నారు. అలా వెళ్తున్న వారి సంఖ్య 30 లక్షల వరకూ ఉంటోంది. ఇక కొత్త నిబంధనల అమలుతో ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా గత రెండేళ్లలో విద్యార్థుల సంఖ్య భారీగా పెరగ్గా, వచ్చే ఏడాది నుండి సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని చెబుతున్నారు. 2013-14లో 1.02 లక్షలు ఉండగా, 2014-15లో 1.32 లక్షలకు పెరిగింది. 2015-16లో ఈ సంఖ్య 1,65,918కి చేరింది. దీంతో చైనా, దక్షిణ కొరియా, కెనడా, సౌదీ అరేబియా దేశాలను దాటి భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. గతంలో ఎన్నడూ లేనంతగా 25 శాతం మంది భారతీయ విద్యార్థులు పెరిగారని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఈ సంఖ్య రెండు లక్షలు దాటుతుందని వేసిన అంచనాలు తలకిందులు అవుతాయని భావిస్తున్నారు. అలాగే ఉద్యోగావసరాలకు వెళ్లే వారికి ఇచ్చే హెచ్-1 బి వీసాల్లో కూడా ఆంక్షలు విధించనున్నారని తెలుస్తోంది. డిసెంబర్ 23 తర్వాత దరఖాస్తు చేసుకునే వారి వీసా ఫీజులను అమెరికా భారీగా పెంచింది. దరఖాస్తు భర్తీ ఫీజు అదనంగా 21 శాతం చెల్లించాల్సి ఉంటుందని కాన్సులేట్ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అంటే ఒక్కో భారతీయ విద్యార్ధి లేదా ఉద్యోగిపై వంద నుండి 200 డాలర్ల అదనపు భారం పడుతుంది. ఇంత చెల్లించిన తర్వాత వీసా వస్తుందో రాదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.