ఆంధ్రప్రదేశ్‌

మీకు బాధ్యత లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 28: పెద్దనోట్ల రద్దుతో తలెత్తిన సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారంటూ బ్యాంకర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారంలో బ్యాంకర్లకు బాధ్యత లేదా? అంటూ నిలదీశారు. బ్యాంకర్ల పనితీరుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఆయన ఫిర్యాదు చేశారు. మరో మూడురోజుల్లో ఉద్యోగులకు జీతాలు, పింఛన్ల చెల్లింపులు చేయాల్సి ఉండటంతో బ్యాంకర్లతో విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సోమవారం ఆయన సుదీర్ఘంగా చర్చించారు. పెద్దనోట్లను రద్దుచేసి మూడువారాలు గడిచినా ఇప్పటికీ బ్యాంక్‌ల వద్ద, ఏటిఎంల వద్ద నిలబడి ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారన్నారు. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు ఉదయం, సాయంత్రం సమీక్షిస్తున్నానని గుర్తుచేశారు. అయినప్పటికీ బ్యాంకర్ల సహాయ నిరాకరణ, వైఫల్యం వల్ల ప్రజల దృష్టిలో నిస్సహాయులుగా మిగిలిపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ చిన్ననోట్లను ఎంతవరకూ పంపిణీ చేశారని బ్యాంకర్లను ప్రశ్నించారు. రాష్ట్రంలో 75 నుంచి 80 వేల కోట్ల రూపాయలను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే ఇప్పటివరకూ 6 వేల కోట్ల రూపాయలు మాత్రమే కొత్త నోట్ల పంపిణీ జరిగిందన్నారు. ఇంత వ్యత్యాసం ఉంటే ప్రజల జీవన విధానంపై ప్రభావం చూపదా? అంటూ ప్రశ్నించారు. బ్యాంకర్ల అసమర్థత వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. బ్యాంకర్ల వద్ద సెంట్రల్ సర్వర్ నుంచి కచ్చితమైన సమాచారం లభించడంలేదన్నారు. అన్ని బ్యాంకులను సమన్వయం చేసుకోవాల్సిన ఆర్‌బిఐ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, దీన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. రోజువారీ సమావేశాలకు వస్తున్న లీడ్ బ్యాంక్ అధికారుల వద్ద కచ్చితమైన సమాచారం ఉండటం లేదన్నారు. 1000 కోట్ల రూపాయల మేరకు చిన్ననోట్లు పంపాలని ఆర్‌బిఐకి చంద్రబాబు లేఖ రాయనున్నారు. మరో మూడురోజుల్లో ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు చెల్లించాల్సి ఉందని, దానికి తగ్గట్లుగా చిన్ననోట్ల సరఫరా లేకపోవడం సమస్యగా మారిందన్నారు. వచ్చేనెల మొదటివారంలో ఎట్టిపరిస్థితుల్లో చిట్టచివరి లబ్ధిదారులకు పింఛన్లు యుద్ధప్రాతిపదికన అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
పింఛన్లకు కరెన్సీ అవసరం
రాష్ట్రంలో ఈ వారం మొత్తం 95 కోట్ల రూపాయల విలువైన 500 నోట్లతో బ్యాంకింగ్ కార్యకలాపాలు మొదలయ్యాయని ముఖ్యమంత్రికి బ్యాంకర్లు వివరించారు. సోమవారానికి 100 రూపాయల నోట్లు 62 కోట్లు ఉన్నాయని, రెండు వేల రూపాయల నోట్లు 1320 కోట్ల రూపాయల మేరకు ఉన్నాయని, 8 కోట్ల రూపాయల మేరకు 20 రూపాయల నోట్లు, 2.6 కోట్ల రూపాయల మేరకు 10 రూపాయల నోట్లు ఉన్నాయని తెలిపారు. మరో వెయ్యి కోట్ల రూపాయల కోసం లేఖలు రాయాలని, అందులో 500, 100 నోట్లు ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పింఛన్ల కోసమే 400 కోట్ల రూపాయలు అవసరమవుతాయని, ఈమేరకు అత్యవసరంగా రాష్ట్రానికి కరెన్సీ సరఫరా చేయాలని ఆర్‌బిఐకి లేఖ రాయాలని సూచించారు. ఆన్‌లైన్ చెల్లింపుల కారణంగా ఉద్యోగుల జీతాలకు ఇబ్బంది ఉండబోదని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌కల్లాం సిఎంకి తెలిపారు. పింఛన్ల పంపిణీకి చిన్ననోట్ల అవసరం ఉంటుందని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులకు, చౌకధరల దుకాణాలకు బిజినెస్ కరెస్పాండెంట్లుగా తాత్కాలికంగా అధికారమిచ్చి పింఛన్ల లావాదేవీలను నిర్వహించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న బిజినెస్ కరస్పాండెట్ల నియామకాలు పూర్తిచేయాలని బ్యాంకర్లను కోరారు. ఇప్పటికే 5250 మందిని నియమించామని, మరో 850 మందిని నియమించాల్సి ఉందని బ్యాంకర్లు తెలిపారు. యుఎస్‌ఐడి విధానం ద్వారా ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ లేకపోయినా లావాదేవీలు నిర్వహించే వీలుందని ఎపి ఫైబర్నెట్ ఎండి సాంబశివరావు వివరించారు.

చిత్రం... విజయవాడలో సోమవారం బ్యాంకర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు