ఆంధ్రప్రదేశ్‌

బాబుకు సారథ్యం ఇస్తే దేశం సర్వనాశనమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: పెద్ద నోట్ల రద్దు వల్ల ఉత్పన్నమయ్యే పరిస్ధితులను సరిదిద్దేందుకు కేంద్రం నియమించిన కమిటీ బాధ్యతలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అప్పగించడం వల్ల దేశం సర్వనాశనమవుతుందని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రామకృష్ణారెడ్డి, ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను చర్చించేందుకు తక్షణమే శాసనసభను సమావేశపరచాలని వారు డిమాండ్ చేశారు. పెద్ద నోట్లు రద్దు అయిపోయి 21 రోజులు అవుతున్నా క్యూ లైన్లు ఇప్పటికీ తగ్గడం లేదన్నారు. బ్యాంకు సిబ్బంది రేయింబవళ్లు పనిచేస్తున్నారని, కాని నోట్ల ముద్రణ తగినంతగా లేదన్నారు.
అక్రమ సంపాదనంత దాచిపెట్టుకొన్న తర్వాత పెద్ద నోట్లను రద్దు చేయాలని లేఖ రాశారన్నారు. చంద్రబాబు నల్లధనంపై కేంద్రం విచారణ జరిపిస్తే మంచిదన్నారు. ఈ రోజు పాలప్యాకెట్లు, కూరగాయలు, సరుకులు కొనాలన్నా భారీ లైన్లలో నిలబడాల్సిన పరిస్ధితి దాపురించిందన్నారు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు జరిపేందుకు సన్నాహాలుచేస్తుంటే, ఏపిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు మీనమేషాలు ఎందుకు లెక్కబెడుతున్నారన్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రజలు పడుతున్న ఇబ్బందులను, కరవుపైన శాసనసభ వేదికగా చర్చించాల్సిన అసరం ఉందన్నారు.