ఆంధ్రప్రదేశ్‌

సింగిల్ పర్మిట్ అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 29: తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య రవాణాకు సంబంధించి సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కోరారు. విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం సిఎంను ఆయన కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ అంశం దాదాపు రెండు సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉందని, దీనిని పరిష్కరించాలని కోరుతూ సిఎంను కలిసేందుకు నిర్ణయించామన్నారు. దాదాపు లక్ష మంది లారీ యజమానులకు సంబంధించిన సమస్య అని తెలిపారు. గతంలో లారీ యజమానులు ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. సింగిల్ పర్మిట్ విధానాన్ని ఒడిశా, కర్నాటక, చత్తీస్‌గడ్, తమిళనాడు రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి సింగిల్ పర్మిట్ ఇస్తున్నారని, కానీ తెలంగాణకు ఇవ్వడం లేదన్నారు. తమ ప్రభుత్వం ఇందుకు సిద్ధంగా ఉందని, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకా పరిశీలనలో ఉందన్నారు. ఈ అంశంపై సిఎం స్పందించడంలో జాప్యానికి ఆయన దృష్టికి వెళ్లలేదన్న అభిప్రాయంతో సిఎంను నేరుగా కలిసేందుకు వచ్చామన్నారు. సింగిల్ పర్మిట్ విధానం వల్ల సంవత్సరానికి కొద్ది మొత్తం చెల్లించి లారీలను నడుపుకునే వీలు ఉంటుందన్నారు. ఈ విధానం లేకుంటే నెలకు ఒక లారీకి 4200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. సిఎం సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నామన్నారు. దీనికి తోడు ఉద్యోగుల విభజన అంశంపై కూడా దృష్టి సారించాలన్నారు.