ఆంధ్రప్రదేశ్‌

డిసెంబర్‌లో కాంగ్రెస్ బస్సుయాత్ర?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 29: రాష్ట్రంలో నిరాశా నిస్పృహతో ఉన్న శ్రేణుల్లో ఉత్సాహం తీసుకురావడంతోపాటు, నేతలను కదిలించేందుకు పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి మరో ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల ముందు బస్సుయాత్ర నిర్వహించిన నాయకత్వం మళ్లీ ఇప్పుడు కూడా రాష్టవ్య్రాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఏఐసిసి నుంచి ఇద్దరు ప్రధాన కార్యదర్శులను యాత్ర ఆసాంతం ఉండేలా చూడటం ద్వారా, నిస్తేజంగా ఉన్న నేతల్లోనూ కదలిక తీసుకురావాలన్న లక్ష్యంతో రఘువీరారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుంచి ఏదో ఒక పేరుతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ, కార్యకర్తల్లో నైతిక స్థైర్యం దెబ్బతినకుండా చూస్తున్న రఘువీరా ఇప్పుడు కూడా అలాంటి మరో ప్రయత్నం చేస్తున్నారు. మంగళవారం విజయవాడలో తనను కలసిన సీనియర్లతో సమీక్ష నిర్వహించిన అనంతరం వారి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీవర్గాల సమాచారం ప్రకారం.. డిసెంబర్ మొదటి వారం నుంచి జనవరి మూడవ వారం వరకూ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. చంద్రబాబునాయుడు ప్రభు త్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయని వైనం, రుణమాఫీతో రైతులను, ఉద్యోగాల కల్పన పేరుతో నిరుద్యోగులను, రుణాల రద్దుతో డ్వాక్రా మహిళలను మోసం చేసిన వైనాన్ని వివరిస్తూ కాంగ్రెస్ ప్రజాపోరుబాట పేరుతో బస్సుయాత్రకు సిద్ధమవుతోంది. ఇందులో ఏఐసిసి ప్రధాన కార్యదర్శులయిన దిగ్విజయ్‌సింగ్, గులాంనబీఆజాద్ కూడా వంతుల వారీగా నిరంతరం యాత్రలోనే కొనసాగుతారని, నలుగురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కూడా ఈ యాత్రలో ఉంటారని సమాచారం. ఏ నియోజకవర్గానికి వెళితే ఆ నాయకులను బస్సులో ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాత్రలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు స్థానిక నేతలతో ముచ్చటించి, వారి నుంచి క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకునే అవకాశం ఉందంటున్నారు.