ఆంధ్రప్రదేశ్‌

మరో రెండు నెలల్లో జిల్లాల పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 29:రాష్ట్రంలో ఇప్పటివరకు ఏడు జిల్లాల్లో పర్యటించి, ఆయా కుల సంఘాలు, ప్రతినిధుల నుండి వినతులు స్వీకరించామని రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ కె ఎల్ మంజునాథ్ చెప్పారు. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నామని, మరో రెండు నెలల్లో మిగిలిన జిల్లాల పర్యటన పూర్తిచేసి, త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. ప్రజాసాధికారక సర్వేను కూడా పరిగణనలోనికి తీసుకుని తమ నివేదికను సమర్పిస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో మంగళవారం రాత్రి ఆయన విలేఖర్లతో మాట్లాడారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు, కోస్తాంధ్రలో శ్రీకాకుళం, వియనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కమిషన్ పర్యటించిందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటన అనంతరం తూర్పు గోదావరి జిల్లాతోపాటు, మిగిలిన 4 జిల్లాల్లో రెండు నెలల్లో పర్యటన పూర్తిచేస్తామన్నారు. నివేదికలను క్రోడీకరించడానికి కొంత సమయాన్ని తీసుకుని, అనంతరం పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. గత రెండు దశాబ్దాలుగా వెనుకబడిన తరగతుల్లో ఉన్న ఎ నుండి ఇ గ్రూపులలో చేర్పులు, మార్పులు కొరకు వినతులు వచ్చాయన్నారు. ఇటీవల కాలంలో తొమ్మిది అగ్ర కులాల వారు బిసిలలో చేర్చాలని కోరారన్నారు. కాపు, తెలగ, ఒంటరి, బలిజ, మైలార్ల, గుల, బ్రాహ్మణ, ఆదివెలమ, పద్మ వెలమ, వైశ్య, వల్లూవ పండరి, వల్లువ సతాని, వల్లువ దాసరి, అర్చక బ్రాహ్మణ, గాజుల బలిజ, కుంటిమల్ల రెడ్డి కులస్థులు బిసిల్లో చేర్చాలని కోరారన్నారు. ప్రధానంగా సామాజిక, ఆర్ధిక, విద్యాపరమైన అంశాలను పరిగణనలోనికి తీసుకుని తాము క్షేత్రస్థాయిలో ప్రజల నుండి అభిప్రాయాలు, వినతులు సేకరిస్తున్నామన్నారు. రాష్ట్రంలో బిసిల్లో 64 కులాలు ఉన్నాయని, అయితే వాటిలో రజక, తదితర కులాల వారు బిసి నుండి ఎస్‌సిలకు మార్పుచేయాలని కోరారన్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి యాదవ, ఉప్పర, కొప్పుల వెలమ, గవర తదితర 9 కులాల వారు బిసిల్లో తమ గ్రూపులు మార్చవలసినదిగా కోరారన్నారు.