ఆంధ్రప్రదేశ్‌

కొలిక్కిరాని అమరావతి లోగో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి లోగోపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. ఏడాది క్రితమే ఇందుకు సంబంధించిన డిజైన్లకు రాజధాని ప్రాధికార అభివృద్ధి సంస్థ దరఖాస్తులను ఆహ్వానించింది. అంతేకాదు ఉత్తమమైన లోగోకు లక్ష రూపాయల పారితోషికాన్ని కూడా ప్రకటించింది. ప్రజా రాజధానిగా అమరావతి చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పటంతో పాటు ఈ ప్రాంత ప్రజల జీవనశైలిని ప్రతిబింబించే విధంగా కృష్ణాతీరంలో రాజధాని ఉండేలా డిజైన్లను రూపొందించాలని సూచించారు. ఇందులో భాగంగా రెండు వేల మంది నుంచి సిఆర్‌డిఎకు డిజైన్లు అందాయి. వీటిలో పది వరకు ఎంపిక చేసిన డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలన నిమిత్తం అధికారులు సిద్ధం చేశారు. ప్రముఖ ఆర్కిటెక్టులు, ప్రవాసాంధ్రులు సైతం తమ మనోభావాలను వ్యక్తీకరిస్తూ డిజైన్లు రూపొందించారు. అయితే ఇప్పటి వరకు డిజైన్ ఎంపిక కాలేదు. రాజధానికి సంబంధించిన చిహ్నం ఎంపికలో ఎందుకింత జాప్యం జరుగుతోందనేది అంతుపట్టటంలేదు. ప్రభుత్వ భవనాలకు శంకుస్థాపన జరిగి నిర్మాణాలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో అమరావతి లోగో అవసరాన్ని సిఆర్‌డిఏ అధికారులు గుర్తించాల్సి ఉంది.